ETV Bharat / city

కొత్త విధానానికి నాంది పలికిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ - తెలంగాణ వాణిజ్య, పన్నుల శఖ తాజా వార్తలు

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కొత్త విధానానికి నాంది పలుకుతోంది. ఆర్థిక సంబంధ శాఖ కావడంతో... అధికారుల బదిలీ జరిగినప్పుడు కొత్తగా వచ్చే వారికి ఉపయోగకరంగా ఉండేందుకు వీలుగా తన పరిధిలోని డీలర్ల వివరాలతో కూడిన సంక్షిప్త చిట్టా సిద్దం చేయాలని నిర్ణయించింది. క్లర్క్‌ దగ్గర నుంచి కమిషనర్‌ వరకు అన్ని స్థాయిల్లోనూ ఈ ప్రక్రియను వర్తింపు చేయడం ద్వారా కొత్తగా వచ్చే ఉద్యోగులకు సులభంగా పాలన సాగించే అవకాశం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

State Department of Commercial Taxes is launching a new policy
కొత్త విధానానికి నాంది పలికిన తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ
author img

By

Published : Jun 21, 2021, 2:11 PM IST

బదిలీలు, పదవీ విరమణలు ప్రతి శాఖలోనూ సర్వసాధారణం. బదిలీ జరిగినప్పుడు ఆ స్థానంలో కొత్తగా వచ్చిన అధికారి పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ కారణంగా కొన్ని విషయాలు సంబంధిత ఉన్నతాధికారి దృష్టికి రాకుండా పోతాయి. ఈ క్రమంలో ముఖ్యమైన విషయాలపై సకాలంలో చర్యలు తీసుకోలేరు. అదే న్యాయపరమైన అంశాలైతే ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇవి నిర్దేశించిన సమయంలో సమర్పించకపోతే శాఖాపరంగా ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతుంది.

నాంది పలికిన నీతూ ప్రసాద్

ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్త తరహా విధానాన్ని వాణిజ్య పన్నుల శాఖలో తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవల ఈ శాఖలో పెద్ద సంఖ్యలో పదోన్నతులు రావడంతో త్వరలో బదిలీలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు వెళ్లిపోతే... కొత్తగా వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సులభతరమైన విధానాన్ని తీసుకురావాలని యోచించిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ సీనియర్‌ అధికారుల బృందంతో చర్చలు ప్రారంభించారు.

పూర్తి వివరాలతో చిట్టా

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో దాదాపు మూడు లక్షల మంది వ్యాపార, వాణిజ్య డీలర్లు ఉన్నారు. వీరందరిని వివిధ స్థాయిల అధికారులు పర్యవేక్షిస్తారు. బదిలీలు జరిగి కొత్త వాళ్లు వచ్చినప్పుడు తన పరిధిలో పెద్ద డీలర్లు ఎవరున్నారు..? వారు ఏ వ్యాపారం చేస్తారు..? వారి నుంచి ఏడాదికి ఎంత జీఎస్టీ వస్తుంది..? ఎంత వ్యాట్‌ వస్తుంది..? అనే విషయాలు సహా న్యాయస్థానాల పరిధిలోని కేసులు, కౌంటర్ దాఖలు చేయాల్సిన సమయాలు తదితర అంశాలను క్లర్క్‌ దగ్గర నుంచి కమిషనర్ వరకు అన్ని స్థాయిల్లోని అధికారులు వారి పరిధిలోని వివరాలతో కూడిన జాబితా సిద్దం చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

5 రోజుల్లో తుదిరూపు

ఒక్కొక్కరు ఒక్కో విధంగా కాకుండా... అన్ని స్థాయిల్లో ఒకేరకమైన విధానంలో వివరాలు సిద్దం చేసేందుకు వీలుగా కమిషనర్‌ నీతూప్రసాద్‌ నేతృత్వంలో సీనియర్‌ అధికారుల బృందం ఒకటి హైదరాబాద్‌ ఐఐటీ అధికారులతో కలిసి ఒక ఫార్మాట్‌ను సిద్దం చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో దీనికి ఒక రూపం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని స్థాయిల అధికారులకు సంకేతం ఇచ్చారు. మరో నాలుగైదు రోజుల్లో తుది చిట్టా సిద్దం చేస్తారని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా కాటుకు నలిగిపోతున్న చేనేత కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.