ETV Bharat / city

'గణపయ్య పూజకు ఆన్​లైన్​లో సామాగ్రి అందిస్తున్న అంకురాలు'

author img

By

Published : Aug 21, 2020, 8:35 PM IST

పండగలు, శుభకార్యాలు, ఉత్సవాలు.. ఇలా వేడుక ఇదైనా ఆ సందడే వేరుగా ఉంటుంది. బంధుమిత్రులు.. ఇరుగుపొరుగుతో ప్రతిఇంటా ఆనందోత్సాహాలు నెలకొంటాయి. కానీ, కరోనా ప్రభావంతో ఆ పరిస్థితులన్ని తలకిందులయ్యాయి. గడప దాటితే ఎక్కడ వైరస్‌ గండం పొంచి ఉందో తెలియక.. ఇళ్లకే అంతా పరిమితం అవుతున్నారు. పండగ సామగ్రి సైతం కొనుక్కోవడం కష్టంగా మారింది. అలాంటి అవసరాలు తీర్చేందుకు ముందుకొస్తున్నాయి కొన్నిఅంకుర సంస్థలు. వినియోగదారుల ఇళ్ల ముందుకే సేవలు అందిస్తున్నాయి.

'గణపయ్య పూజకు ఆన్​లైన్​లో సామాగ్రి అందిస్తున్న అంకురాలు'
'గణపయ్య పూజకు ఆన్​లైన్​లో సామాగ్రి అందిస్తున్న అంకురాలు'
'గణపయ్య పూజకు ఆన్​లైన్​లో సామాగ్రి అందిస్తున్న అంకురాలు'

కరోనా... కొత్త జీవితానికి అలవాటు పడేలా చేసింది. పండుగలు, వేడుకలు జరుపుకునే విధానాన్నే మార్చేసింది. సామూహిక కార్యక్రమాలు పూర్తిగా దూరమవ్వగా.. ప్రధాన పండుగలు కూడా సాధారణంగా నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది. శుభకార్యాల్లో హంగు ఆర్భాటాలు కనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలపై కొవిడ్‌ ప్రాభావం తీవ్రంగా పడింది. వినాయక విగ్రహాల కొనుగోళ్ల దగ్గర్నుంచి.. మండపాల ఏర్పాటు హడావుడి లేకుండా పోయింది. ఎవరి ఇంట్లో వాళ్లే మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. అందుకు ప్రజలు సిద్ధపడ్డారు.

21 రకాల పూజా సామగ్రిని ఇంటివద్దకే..

వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా వ్యాపారులు సైతం అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారు. పూజలు, శుభకార్యాలకు ఇప్పటికే ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నారు. ఇదే తరహాలో వినాయక చవితికి సిద్ధమయ్యారు. ఇప్పటేకి పండ్లు, కూరగాయలు, పాల సరఫరాతో వినియోగదారుల మన్ననలు పొందిన 'క్రాప్‌2కిచెన్' రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం పూజా సామాగ్రిని సరఫరా చేస్తోంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌పై వినియోగదారుల ఇళ్ల ముంగిట్లోకి వినాయకుడిని చేరవేస్తోంది. ఒక్కో ప్యాక్‌కు రూ.749 పాటు రవాణాఛార్జిగా రూ.50గా నిర్ణయించింది. 8 అంగుళాల వినాయకుడు ప్రతిమ సహా పత్రితో కూడిన 21 రకాల పూజా సామగ్రిని ఇంటివద్ద అందిస్తోంది.

ప్రసాదాలు సైతం ఆన్‌లైన్‌లోనే..

కూకట్‌పల్లిలో వింటేజ్ స్నాక్స్‌, క్రీమ్స్‌ అంకుర కేంద్రం సైతం ఇదే తరహాలో సేవలు అందిస్తోంది. పుట్టిన రోజు,వివాహాది, శుభకార్యాలకు మిఠాయిలు ఆన్‌లైన్‌లో సరఫరాచేసే ఆ అంకుర కేంద్రం.. వినాయక చవితికి ప్రత్యేకత చాటుకుంటోంది. సేంద్రీయ విధానంలో పండించిన చిరుధాన్యాలు, పాలు, ఇతర ఉత్పత్తులు, బెల్లంతో తయారు చేసిన మిఠాయిలు వినియోగదారుల ఇళ్ల ముంగిట్లోకి తీసుకెళుతోంది. చవితి దృష్ట్యా 'క్రాప్‌2కిచెన్' వంటి సంస్థలతో ఒప్పందం చేసుకొని వడపప్పు, చలిమిడి, పులిహోర, పరమాన్నం లాంటి ప్రసాదాలు ఆన్‌లైన్‌లో అందిస్తోంది.

వినియోగదారుల సంతృప్తి..

ఇంటివద్దకే నాణ్యమైన సేవలు అందుతుండటంపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమయంతో పాటు కరోనా గండం నుంచి గట్టెక్కేందుకు ఆన్‌లైన్‌ వేదికలు ఉపయోగంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి: డీలాపడ్డ పూల మార్కెట్​.. ఆవేదన చెందుతున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.