స్టాఫ్‌నర్సు ఉద్యోగాల అభ్యర్థుల సవరించిన మెరిట్ జాబితాను.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మెరిట్‌జాబితాను గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించగా.. సర్వీస్ వెయిటేజీ మార్కులు కలపలేదని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్‌తో ప్రకటించిన జాబితాను వెనక్కి తీసుకుంది.
వైద్యారోగ్యశాఖ పంపిన సర్వీస్ వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని... మరోసారి మెరిట్ జాబితాను విడుదల చేసింది. మొత్తం 54 మందికి సర్వీస్ వెయిటేజీ కలిపినట్లు వెల్లడించిన టీఎస్పీఎస్సీ... వైద్యారోగ్యశాఖ నుంచి ఇంకా పేర్లు అందితే మళ్లీ జాబితా సవరిస్తామని తెలిపింది.