ETV Bharat / city

జలవిద్యుత్‌కు ఆయువు పట్టు శ్రీశైలం ప్రాజెక్టు - Srisailam Hydel Project news

ఉమ్మ‌డి రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి రివ‌ర్స‌బుల్ సాంకేతిక ప‌రిజ్ఞానం క‌లిగిన జ‌ల విద్యుత్ కేంద్రంగా శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రం ప్రావిణ్యం గావించింది. 1.2 కిలోమీట‌ర్ల భూగ‌ర్బంలో నిర్మించిన దేశంలో మొట్ట‌మొద‌టి విద్యుత్ కేంద్రంగా కూడా చెప్పుకోవ‌చ్చు. శ్రీశైలం ఎడ‌మ‌గ‌ట్టు విద్యుత్ కేంద్రం అనేక ప్ర‌త్యేక‌త‌లను, సాంకేతికత‌ను సొంతం చేసుకుంది.

Srisailam First Reversible Hydel Project
జలవిద్యుత్‌కు ఆయువు పట్టు శ్రీశైలం ప్రాజెక్టు
author img

By

Published : Aug 22, 2020, 9:18 AM IST

రాష్ట్ర విద్యుత్‌ రంగానికి జలవిద్యుత్‌ ఆయువుపట్టు కాగా...ఆ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో శ్రీశైలం ప్రాజెక్టుదే ప్రధాన పాత్ర. అత్యంత చౌకగా విద్యుత్‌ను అందిస్తున్న జలవిద్యుత్కేంద్రాలు ఏటా రూ.వందల కోట్లు ఆదా చేస్తూ ఎంతో ఆదుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్‌ను రూ.6 కు పైగా వెచ్చిస్తే తప్ప కొనలేని పరిస్థితుల్లో ఈ కేంద్రాల నుంచి సగటున రూ.3.56కే లభిస్తోంది.

Srisailam First Reversible Hydel Project
జలవిద్యుత్‌కు ఆయువు పట్టు శ్రీశైలం ప్రాజెక్టు

* రాష్ట్రంలో 11 చోట్ల ఉన్న జలవిద్యుత్కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2441.80 మెగావాట్లు. ఇందులో శ్రీశైలం 900, నాగార్జునసాగర్‌ 815.60 మెగావాట్లతో 70.25 శాతం ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. 11 జలవిద్యుత్కేంద్రాలున్నా విద్యుదుత్పత్తి అధికంగా జరిగేది శ్రీశైలంలోనే. ఉదాహరణకు గతేడాది (2019-20) మొత్తం 4509.20 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ ఉత్పత్తికాగా శ్రీశైలం నుంచి వచ్చిందే 1993.10 ఎంయూ (44.20 శాతం) ఉండటం గమనార్హం.
* రాష్ట్ర జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో శ్రీశైలం కేంద్రం వాటా 36 శాతమే అయినా ఉత్పత్తిలో ఏటా అంతకుమించి ఉంటోంది. ఇక ఈ ఏడాది (2020-21)లో ఈ నెల 20 వరకూ రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్కేంద్రాల నుంచి 428 ఎంయూల ఉత్పత్తి కాగా ఇందులో శ్రీశైలం నుంచి వచ్చిన కరెంటే 277.3 ఎంయూలు.

* శ్రీశైలం ఆనకట్ట నుంచి నీటిని ప్రదానంగా విద్యుదుత్పత్తి కోసమే వాడుతుంటారు. పైగా ఆనకట్టలో నీరు తక్కువ ఉన్నప్పుడు అవి వృథా కాకుండా ఒకసారి విద్యుదుత్పత్తికి వాడి కిందికి వదిలిన నీటిని మళ్లీ వెనక్కి రిజర్వాయర్‌లోకి పంపింగు చేసే సాంకేతికత ఈ జలవిద్యుత్కేంద్రానికి ఉంది. ఈ రివర్స్‌బుల్‌ పంపింగ్‌ పరిజ్ఞానంతో, ముందుచూపుతో నిర్మించిన జల విద్యుత్కేంద్రాలు దేశంలో తక్కువగా ఉన్నాయి.
* గత ఫిబ్రవరి 28న రోజూవారీ విద్యుత్‌ డిమాండు 13,168 మెగావాట్లుగా నమోదైంది. ఇలా డిమాండు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు శ్రీశైలంలో తక్కువ నీరున్నా దాంతో విద్యుదుత్పత్తి చేసి తిరిగి ఆ నీటిని వెనక్కి రిజర్వాయర్‌లోకి పంపడం ద్వారా ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడింది. అదే ఫిబ్రవరిలో ఈ కేంద్రంలో 134 ఎంయూల కరెంటు ఉత్పత్తి జరిగింది. మిగతా 10 జల విద్యుత్కేంద్రాల ఉత్పత్తి మొత్తం కలిపినా ఆ నెలలో 45 ఎంయూలోపే ఉండటం గమనార్హం.

ఇవీచూడండి: అంతిమ ఘడియల్లో ప్రాణత్యాగానికి సిద్ధపడిన విద్యుత్‌ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.