వర్ధన్ బ్యాంక్ అక్రమాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల పార్లమెంట్ వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్న పిలవడం వల్లే ఆత్మకూరులో వర్ధన్ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభోత్సవానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆ కార్యక్రమంలో వారు మాట్లాడాలని కోరితేనే మాట్లాడినట్లు చెప్పారు. అయినా మోసపోయిన వాళ్లంతా వైకాపా వాళ్లేనని పేర్కొన్నారు.
ఈ వివాదానికి కారణమైన వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. వర్ధన్ బ్యాంకు అక్రమాల్లో ఎంతటి వారి పాత్ర ఉన్నా.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు.
'తక్కువ వడ్డీకి ఇస్తానంటున్నాడని చెబితే లోన్ తీసుకోమని చెప్పినా.. అందులో 70 నుంచి 80 శాతం మంది వైకాపా వాళ్లే. ఆ తర్వాతే తెలిసింది మావాళ్లు మోసపోయారని. వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలన్నను సస్పెండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరాం.
- ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఇదీచూడండి: National Green Tribunal : 'తెలంగాణ సర్కార్ పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడుతోందా?'