ETV Bharat / city

నీరా కేఫ్‌ను ఆగస్టులో అందుబాటులోకి తెస్తాం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Srinivas Goud Visit Neera Cafe: ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను నిర్లక్ష్యం చేశారని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను పరిశీలించారు. నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని... టూరిజం ఎండీని ఆదేశించారు.

Srinivas Goud
Srinivas Goud
author img

By

Published : Jun 3, 2022, 12:49 PM IST

Srinivas Goud Visit Neera Cafe: హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నీరా కేఫ్​ను ఆగస్టులో అందుబాటులోకి తెస్తామని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో కుల వృత్తులను నిర్లక్ష్యం చేశారని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ప్రదాయిని నీరాను.. ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్య ఔషధంగా అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్ఠాత్మకంగా నీరా కేఫ్ ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్​లో సుమారు 10 కోట్ల రూపాయలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం ఎండీ మనోహర్​ని మంత్రి ఆదేశించారు. నీరా సహా అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్లను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండీ మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:మాజీ ప్రియుడే కదా అని పర్సనల్​ ఫొటోలు పంపితే...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.