ETV Bharat / city

బెల్టుతో చితకబాదిన వీడియో వైరల్​.. నిందితుల అరెస్టు - srikakulam video viral news

ఒక వ్యక్తిని మరో వ్యక్తి బెల్టుతో కొడుతూ హింసించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులను శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది 2017 మార్చిలో జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. అప్పు తీర్చలేదనే కోపంతో రౌడీ షీటర్ బెల్టుతో కొట్టి హింసించాడు.. అప్పు తీర్చేసినా బాధితుడు భయంతో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు.

బెల్టుతో చితకబాదిన వీడియో వైరల్​.. నిందితుల అరెస్టు
author img

By

Published : Nov 15, 2019, 9:59 AM IST

బెల్టుతో చితకబాదిన వీడియో వైరల్​.. నిందితుల అరెస్టు

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియో ఆధారంగా శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి.. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని మరో వ్యక్తి బెల్టుతో కొడుతూ హింసించిన వీడియో వైరల్ అయ్యింది. అది గమనించి రంగంలోకి దిగిన పోలీసులు... ఆ ఘటన 2017 మార్చిలో జరిగినట్లు గుర్తించారు.

నిందితులను పట్టుకుని అరెస్ట్‌ చేశారు. 50 వేల రూపాయలు అప్పు తీర్చలేదని, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదనే కోపంతో రౌడీషీటర్ చంద్రశేఖర్‌ అలియాస్‌ కుంగుఫూ శేఖర్‌.... గిరిజా రమణ అనే వ్యక్తిని కొట్టి హింసించినట్లు పోలీసులు తెలిపారు.

మరొకరిని చెంపపై కొడుతూ బెదిరించినట్లు చెప్పారు. అందుకు సహకరించిన కల్యాణ చక్రవర్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా.. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.