MOHAN BABU: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నిరసన చేపట్టిన కేసులో శ్రీవిద్యానికేతన్ ఛైర్మన్, సినీనటుడు మోహన్ బాబు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని శ్రీ విద్యానికేతన్ సమీపంలో 2019 మార్చి 22న విద్యార్థులతో కలిసి తిరుపతి - మదనపల్లె రహదారిపై ఆందోళన నిర్వహించారు.
మీ అందరికి నమస్కారం. నేను ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. మాకు ఎలాంటి సమన్లు అందలేదు. న్యాయాధికారి పిలిచారు. అందుకే మేమంతా వచ్చాం. సంతకం పెట్టాం. వెళ్తున్నాం ఇక అంతే.
- మోహన్ బాబు, శ్రీవిద్యానికేతన్ ఛైర్మన్
అప్పటి ఆందోళనలో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ పాల్గొన్నారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మోహన్ బాబుపై చంద్రగిరి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో జరుగుతున్న కేసు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు సమన్లు జారీ చేయడంతో ఇవాళ కుమారులిద్దరితో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఎన్టీఆర్ కూడలి నుంచి విద్యార్థులతో కలిసి మోహన్ బాబు కోర్టు వరకు కాలినడకన వచ్చారు. విచారించిన ధర్మాసనం సెప్టెంబర్ 20కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: