ETV Bharat / city

శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో సేవలు ప్రారంభం - శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం తాజా వార్తలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు వారణాసిలోని అన్ని దేవాలయాలు తెరుచుకున్నాయి. శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ... యాత్రికులను ఆశ్రమం కల్పిస్తున్నారు.

sri-rama-taraka-andhra-ashramam-open-in-kashi-uttar-pradesh
శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో సేవలు ప్రారంభం
author img

By

Published : Sep 18, 2020, 5:38 PM IST

కరోనా నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ క్షేత్రంలో మూతబడ్డ ఆశ్రమాలు.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అన్‌లాక్‌ నిబంధనల మేరకు తెరుచుకున్నాయి. కాశీలో శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలోనూ సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ... ఆశ్రమం తరపున కాశీకి వచ్చే యాత్రికుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆశ్రమంలోకి ప్రవేశ ద్వారం వద్దే శానిటైజేషన్‌ ఏర్పాటు చేశాం. రోజుకు రెండు సార్లు కెమికల్ స్ప్రే, రెండు సార్లు సాంబ్రాణి పొగ వేస్తున్నాం. భోజనాల శాలలో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు‌ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వి వి సుందర శాస్త్రీ వివరించారు. కాశీకి వచ్చే యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా అశ్రమం తరపున విజ్ఞప్తి చేశారు.

లాక్‌డౌన్‌లో సేవలు..

లాక్‌డౌన్‌ సమయంలో కాశీలో ఇరుక్కుపోయిన చాలా మంది యాత్రికులకు శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. ఆశ్రమం తరఫున అందరికీ ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేయడమే కాక వారి స్వస్థలాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసి దాతృత్వం చాటారు.

శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమంలో సేవలు ప్రారంభం

ఇదీ చూడండి: శ్రీరామ్ సాగర్​ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.