శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులపై తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎస్సారెస్పీ రెండో దశ పనులు ఈ నెలలో పూర్తవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ కింద చేర్చే సమయంలో 2019 జూన్ నాటికి పూర్తి చేయాలనుకున్నప్పటికీ.. భూసేకరణలో జాప్యం జరగడం, డిస్ట్రిబ్యూటరీలపై నిర్మాణాలు పూర్తికాకపోవడంవల్ల ఇప్పుడు 2021 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
కేంద్రం అమలుచేస్తున్న ఏఐబీపీ స్కీం కింద దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో వేగంగా పూర్తిచేయాలని నిర్ణయించామని, ఆ జాబితాలో దీన్ని 2016-17లో చేర్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,78,066 హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కలుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఈ ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద రూ.48.36 కోట్లు అందించాలని నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.39.29 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో రూ.22.29 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు ఖర్చుచేసిందని వివరించారు.
- ఇదీ చూడండి : కరోనా సంక్షోభం వల్ల ఆ హామీ వాయిదా పడింది: హరీశ్ రావు