Rajapaksa visits Tirumala: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి షిరాంతి రాజపక్సతో కలసి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాజపక్సకు పండితులు వేదాశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఘన స్వాగతం..
Sri Lanka PM To Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీలంక ప్రధాని రాజపక్స, కుటుంబంతో సహా నిన్న తిరుమలకు వచ్చారు. కొలంబో నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు.. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఘన స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో స్వాగతం ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: Revanth Reddy on paddy procurement: 'ఆ పదివేల కోట్లు మాకివ్వండి.. మేమే ధాన్యం కొంటాం'