హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అప్రమత్తమైన నగరపాలక సంస్థ డీఆర్ఎఫ్ సిబ్బంది చేత రహదారులు వెంట, కాలనీల్లో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తోంది.
ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రోడ్ల వెంట విపత్తు నిర్వహణ సిబ్బంది ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ద్రావణం చల్లారు. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తున్నందున రద్దీ ప్రాంతాల్లో హైడ్రో క్లోరైడ్ పిచికారీ చేస్తున్నారు. కరోనా రెండో దశ వేగంగా విజృంభిస్తున్నందున.. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలని.. ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు.
- ఇదీ చదవండి : పెరుగుతున్న కొవిడ్ మరణాలతో అంత్యక్రియలకు ఇబ్బందులు!