ETV Bharat / city

అవరోధాలే అస్త్రాలుగా.. సిరుల పంట పండించగా..! - విశాఖ మన్యంలో జమున సాగు విధానం

సాగులో ఎదురైన అవరోధాలనే.. కొత్త ఒరవడికి నాందిగా మార్చుకుంది ఓ ఆదివాసీ మహిళ. సంప్రదాయ వ్యవసాయ విధానంలో నష్టాలను చవిచూసిన ఆమె.. చోడి పంట అనే నూతన పద్ధతితో సిరుల సాగు చేస్తోంది. లాభాలను అందించే ఆ పద్ధతిని రైతు సాధికార సంస్థ గుర్తించింది. ఆ సాగు విధానానికి ఆమె పేరే పెట్టి గౌరవించింది.

అవరోధాలే అస్త్రాలుగా.. సిరుల పంట పండించగా..!

author img

By

Published : Mar 30, 2021, 4:38 PM IST

అవరోధాలే అస్త్రాలుగా.. సిరుల పంట పండించగా..!

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలం హంసబందకు చెందిన మహిళా రైతు జమున... 'చోడి' పంట సాగులో కొత్త విధానాన్ని రూపొందించారు. తొలుత సాధారణ గులిరాగి పద్ధతిలోనే జమున సాగు చేసేవారు. విత్తనాల వృథా, దిగుబడి తగ్గడం, పెట్టుబడి వ్యయం పెరగడం లాంటి కారణాల వల్ల... ఆదాయం వచ్చేది కాదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వ్యవసాయంపై సలహాలిస్తున్న... సంజీవిని అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అమ్మాజీని కలిసి సలహాలు తీసుకున్నారు. 'చోడి' పంట సాగులో కొత్త విధానాన్ని రూపొందించారు. అధిక విత్తనాల వృథాకు అడ్డుకట్ట వేసి... తక్కువ విత్తనాలు, తక్కువ పెట్టుబడితోనే అంతకుమించి ఆదాయం సంపాదించేలా కొత్త పద్ధతిని రూపొందించారు. ఈ విధానంలో నాలుగైదు రెట్లు దిగుబడులు వస్తున్న కారణంగా.. ఈ పద్ధతిపై గిరిజనులు ఆసక్తి చూపిస్తున్నారు.

సాగు విధివిధానాలు...

ఘన, ద్రవ జీవామృతాలను ఉపయోగించి విత్తనాలను నేరుగా గోతుల్లో వేసి సాగుచేయటం ప్రారంభించారు. 15 రోజుల తర్వాత కొరుడు తిప్పారు. అంటే కర్రని మొక్కలపై నుంచి తాడు సాయంతో పైకి లాగడం వల్ల... వేర్లు, కాండం కలిసే చోట మొక్కలు వంగి, వాటిలో విభజన జరిగి అధిక పిలకలు వచ్చాయి. సేంద్రియ ఎరువు నేరుగా పైరుకు అందించడంతో నాలుగింతల ఆదాయం లభించింది. సాధారణ పద్ధతిలో ఒక బస్తా దిగుబడి వస్తే... ఈ విధానంలో ఐదారు బస్తాల వరకూ వస్తోందని జమున భర్త సురేశ్‌ తెలిపారు.

ఆధునిక ఆవిష్కరణకు ఆమె పేరే..

వ్యవసాయ అధికారులు.. జమున సాగు విధానాన్ని పరిశీలించారు. ఆ విధానం ద్వారా ఆమె సాధించిన ఫలితాన్ని... ఉన్నతాధికారులకు వివరించారు. కొత్త పద్ధతిని పరిచయం చేసిన జమున పేరుతోనే.. ఆ విధానాన్ని అమలు చేయడానికి రైతు సాధికార సంస్థ ఆమోద ముద్ర వేసింది. 80 సెంట్ల భూమిలో తొలిసారి 500 కిలోలే దిగుబడి వచ్చిందని..... ఇటీవలే 2 వేల కిలోలకు పైగా దిగుబడి వచ్చిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. మన్యం ప్రాంతంలో జమున సాగు పద్ధతి చాలా అనుకూలమైనదని... రైతులు ఆ విధానాన్నే పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.