ETV Bharat / city

ఆమె వయసేమో 70.. సాధించిన పతకాల సంఖ్య మాత్రం 80

MEDALS: కొంతమందిని చూస్తే వీళ్లు వయసుకి ఎదురీదుతున్నారేమో అనిపిస్తుంది. అలాంటి వారే 76 ఏళ్ల ఈ బామ్మ. కారణం.. 66 ఏళ్లకి క్రీడల్లో అడుగుపెట్టి 80 పతకాలు సాధించారామె. ఏపీలోని విజయవాడకు చెందిన అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆమేం చెబుతున్నారో చూడండి..

venkata subbalakshmi
venkata subbalakshmi
author img

By

Published : Jul 5, 2022, 9:18 AM IST

MEDALS: ఆమె వయసు 76 కానీ.. ఆమె క్రీడల్లో సాధించిన పతకాల సంఖ్య మాత్రం 80. మరి ఇన్ని పతకాలు పొందడానికి ఆమె పడిన కష్టం, శ్రమ పూర్తిగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

'మాది ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. అమ్మ కప్పగంతు మంగమ్మ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. నాన్న సూర్యనారాయణ రైల్వేలో టీటీఈ. చిన్నప్పటి నుంచీ ఖోఖో బాగా ఆడేదాన్ని. ఏయూలో ఎమ్మెస్సీ (బోటనీ) చేశా. ఆ వెంటనే విజయవాడ మేరిస్‌ స్టెల్లా కళాశాలలో బోటనీ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే బోటనీ అధ్యాపకులు అమ్మన్న శాస్త్రితో వివాహమైంది. అదే ఏడాదిలో అప్పటి నల్గొండ జిల్లా సర్వేల్‌లోని ఏపీఆర్‌ఎస్‌ (గురుకుల పాఠశాల)లో నాకు పీజీటీగా ఉద్యోగం వచ్చింది. నేను సర్వేల్‌లో.. మా వారు విజయవాడలో ఉండే వాళ్లం. తర్వాత మచిలీపట్నంలోని ఎస్‌పీఎంహెచ్‌ కళాశాలలో 1976లో బోటనీ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌గా చేరాను. మాకు ఒక అబ్బాయి, అమ్మాయి. ఇద్దరూ బిట్స్‌ పిలానీలో డిగ్రీ చేసి, అమెరికాలో ఎంఎస్‌ చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా అబ్బాయి యూఎస్‌ఏలో.. అమ్మాయి బెంగళూరులో స్థిరపడ్డారు. 2004లో పదవీవిరమణ పొందాను.'

పౌరుషంతో క్రీడల్లోకి.. వేసవి సెలవుల్లో మా మనవళ్లని విజయవాడ గాంధీనగర్‌లో ఈత నేర్పించడానికి తీసుకెళ్లా. అప్పటికి నా వయసు 66. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ వంటి సమస్యలున్నాయి. మోకాలు మార్పిడి జరిగింది. స్విమ్మింగ్‌ పూల్‌లో సాధన చేస్తున్న నా మనవళ్లను ప్రోత్సహిస్తుంటే.. వాళ్లలో ఒకడు ‘బయట ఉండి ప్రోత్సహించడం కాదు.. పూల్‌లోకి దిగండి, తెలుస్తుంది’ అన్నాడో రోజు. ఆ మాటలకి పౌరుషం వచ్చింది. మరుసటి రోజు నుంచి స్విమ్‌ సూట్‌ వేసుకొని పూల్‌లో సాధనకు దిగాను. నెల రోజుల్లోనే నాలుగు స్టైల్స్‌ నేర్చుకున్నా.

అదే సంవత్సరం (2016)లో రాష్ట్ర స్థాయి మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 70-74 కేటగిరీలో తలపడి 50మీ., 100మీ. ఫ్రీ స్టైల్‌, 50మీ., 100మీ. బ్రెస్ట్‌ స్ట్రోక్‌ల్లో పసిడి పతకాలు కైవసం చేసుకున్నా. సికింద్రాబాద్‌లో జాతీయ స్థాయి మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అయిదు పసిడి పతకాలు గెలిచా. అప్పటి నుంచి ఏటా రాష్ట్ర, జాతీయ స్థాయి మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో పతకాలు గెలుస్తూవచ్చా. ఏటా జనవరిలో నిర్వహించే కృష్ణా రివర్‌ క్రాసింగ్‌ పోటీల్లో తలపడుతున్నా. ఈతకే ఎందుకు పరిమితం కావాలనిపించి పరుగు, జావెలిన్‌త్రోల్లో కూడా శిక్షణ తీసుకున్నా. 2017 నుంచీ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌త్రో, పరుగులో మూడు రజత పతకాలు సొంతం చేసుకున్నాను. కొవిడ్‌ తర్వాత 2021 నవంబరులో నాసిక్‌లో జరిగిన జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పసిడి, అదే నెల వారణాసిలో జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు పసిడి, రజత, కాంస్య పతకాలూ సొంతం చేసుకున్నా.

వయసులో సాధన, డైట్‌ వంటివి కష్టమే అయినా పట్టుదలతో అడుగులు వేస్తున్నారు సుబ్బలక్ష్మి. ఇటీవల కాలంలో భర్తని కోల్పోయిన ఆమె కొన్ని రోజులుగా కుమార్తె దగ్గర ఉంటున్నారు. అక్కడున్నప్పుడు సాధన కోసం... ఈత కొలనుకు వెళ్తుంటారు. విజయవాడలో ఉంటే కృష్ణానదిలో సాధన చేస్తారు. రోజూ జాగింగ్‌, వాకింగ్‌ తప్పనిసరి. శాకాహారి కావడంతో తనే ఆహారాన్ని వండుకుంటారు. ‘స్విమ్‌సూట్‌లో అడుగుపెట్టడానికి నేనేమీ బిడియపడలేదు. మావారు, పిల్లలు ఇచ్చిన ప్రోత్సహంతోనే క్రీడల్లో అడుగుపెట్టాను. విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో 76 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో కొనసాగుతున్నా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.