ETV Bharat / city

అగ్గిపిడుగు అల్లూరి వీరగాథ.. వింటే దేహం రోమాంచితమే! - అల్లూరి సీతారామరాజు స్పెషల్​ స్టోరీ

ALLURI SEETHARAMARAJU: విల్లుతోనే బ్రిటిషర్లలో గుబులు పుట్టించిన వీరుడాయన..! పోలీసుల దగ్గరే తూటా దింపడం నేర్చుకుని స్టేషన్లు పేల్చేసేంత తెగువ ఆయనది..! చిన్నతనంలో తెల్లదొరకు నమస్కరించడంపై తండ్రి మందలింపుతో ఆనాడే దేశభక్తి ఉప్పొంగింది..! విదేశీ చదువు పట్ల విముఖత..! పరాయిపాలనపై వైరుధ్యం..! అన్నింటికి మించి మాతృభూమి కోసం ప్రాణాలు ఇచ్చే తెగువ..! గిరిజనులకు సేవలు చేస్తూ వారినే తన సైన్యంగా చేసుకుని తెల్లోళ్లకు ముచ్చెమటలు పట్టించారు..! ఆ ధీరుడు మరెవరో కాదు.. మన్యం పేరు చెబితే గుర్తొచ్చే అల్లూరి సీతారామరాజు. ఆయన 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

అగ్గిపిడుగు అల్లూరి వీరగాథ.. వింటే దేహం రోమాంచితమే!

author img

By

Published : Jul 3, 2022, 9:55 PM IST

అగ్గిపిడుగు అల్లూరి వీరగాథ.. వింటే దేహం రోమాంచితమే!

ALLURI SEETHARAMARAJU: ఆంధ్రప్రదేశ్​లోని ఉమ్మడి విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో 1897 జులై 4న అల్లూరి సీతారామరాజు జన్మించారు. బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేయాలన్న ఆకాంక్షకు చిన్ననాడే బీజం పడింది. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన అల్లూరి.. బంధువుల సహకారంతో కాకినాడ, తుని, నరసాపురం, విశాఖలో చదువు సాగించారు. తర్వాత దేశమంతా పర్యటించి విద్య, వైద్యంలో నైపుణ్యం సాధించారు. ప్రజాసేవతో గిరిజనులను పోరాటానికి సన్నద్ధం చేశారు. గిరిజనుల నుంచి విలువిద్య, పోలీసుల ద్వారా తుపాకీ పేల్చడం నేర్చుకున్నారు. 150 మంది గిరిజన వీరులను తయారు చేసి 1922 ఆగస్టు 22న చింతపల్లి పొలీస్‌స్టేషన్‌పై తొలి దాడి చేశారు. ముందే సమాచారం ఇచ్చి మరీ ముట్టడించడం బ్రిటిషర్లను హడలెత్తించింది. రెండోరోజు కృష్ణదేవిపేట, మూడోరోజు రాజవొమ్మంగి స్టేషన్లపై దాడి చేశారు.

ఆయుధాలు స్వాధీనం చేసుకుని మరీ.. లెక్కరాసి సంతకం చేసిన తెగువ సీతారామరాజుది. బ్రిటిష్ అధికారులతో.. ఆరు సార్లు ముఖాముఖిగా తలపడ్డారు. ఆరుసార్లూ అల్లూరి దళాలదే విజయం. అడ్డతీగల, రంపచోడవరం స్టేషన్లపైనా దాడి చేసినా.. ఆయుధాలు దొరకలేదు. వీరిని పట్టుకునేందుకు రూథర్‌ఫోర్డ్ నేతృత్వంలో సాయుధ దళాలు మన్యం చేరుకున్నాయి. తాను లొంగిపోతే.. తననే నమ్ముకున్నవారి నిర్భందం తగ్గుతుందని.. సీతారామరాజు భావించారు. 1924 మే 7న విశాఖ జిల్లా కొయ్యూరు వద్ద మంపవాగులో స్నానం చేస్తూ.. పోలీసులకు తన ఆచూకీ చెప్పాలంటూ పశువుల కాపరిని పంపారు.

క్షణాల్లో చుట్టుముట్టిన పోలీసులు.. రాజేంద్రపాలెంలోని సైనిక శిబిరానికి తీసుకొచ్చారు. సీతారామరాజును మేజర్ గుడాల్ అనే అధికారి చింతచెట్టుకు కట్టేసి ప్రశ్నించాడు. బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లేవరకు పోరాడుతానన్న సమాధానంతో అల్లూరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వందేమాతరం అంటూ ఆ మహనీయుడు నేలకొరిగారు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు.

మన్యం నేలపై సాగిన అపూర్వ పోరాటం అమరవీరుడి ప్రాణత్యాగం.. ఇప్పటికీ సజీవంగానే ఉంది. పాండ్రంగిలో.. అల్లూరి పుట్టిన ఇంటిని పరిరక్షించారు. పాండ్రంగిని సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించి రక్త సంబంధీకులను సత్కరించారు. విగ్రహాల ఏర్పాటుకు.. అల్లూరి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆర్​ఎస్​డీ​పీఏ రాజు కృషి చేశారు. అల్లూరి నడయాడిన ప్రాంతాల్ని.. స్ఫూర్తిక్షేత్రాలుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని నరసింహరాజు కోరారు. అల్లూరి 125వ జయంతి వేళ.. పాండ్రంగిలో ఆయన స్మారకంగా తీర్చిదిద్దిన ఇంటి వద్ద కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవీ చదవండి:

'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది..'

'ప్రభాస్​లో అదే అత్యుత్తమ లక్షణం.. తనకు ప్రత్యేక స్థానం ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.