ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పురాతన మల్లేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోళుల కాలంలో కట్టిన ఈ పురాతన ఆలయంలో ప్రతి ఏటా రోహిణి కార్తె ప్రారంభం రోజున ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈసారి సోమవారం కావడం వల్ల శివలింగాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకారం ఆకర్షణీయంగా ఉండటంతో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!