ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు స్పెషల్‌ వ్యాక్సినేషన్ డ్రైవ్‌

author img

By

Published : May 28, 2021, 8:44 PM IST

కరోనా కట్టడికి వాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం... సూపర్‌ స్ప్రెడర్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టీకా పంపిణీ చేసింది. వ్యాక్సినేషన్ స్పెషల్‌ డ్రైవ్‌లో టీకాలు వేయించుకునేందుకు అర్హులైన వారు ఉత్సాహంగా తరలివచ్చారు.

vaccination for super spreaders
సూపర్‌ స్ప్రెడర్లకు స్పెషల్‌ వ్యాక్సినేషన్ డ్రైవ్‌

నిత్యం ప్రజల మధ్య ఉండి సేవలందించే వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన సూపర్‌ స్ప్రెడర్‌ ప్రత్యేక వాక్సినేషన్‌ డ్రైవ్‌కు భారీగా తరలివచ్చారు. వేగంగా కరోనాను కట్టడి చేసే వ్యూహాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ డ్రైవ్‌ ద్వారా ఎల్పీజీ, పెట్రోలు, చౌకధరల దుకాణాల డీలర్లు, వర్కర్లు, గుర్తించిన చిరు వ్యాపార వర్గాలతో పాటు జర్నలిస్టులకూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టీకా పంపిణీ చేశారు. ఈ టీకా కేంద్రాల్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.

ఎంత వ్యయమైనా భరిస్తాం..

హైదరాబాద్‌ బన్సీలాల్​పేటలోని మల్టీపర్పస్ ఫంక్షన్​హాల్‌లో సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా పరిషత్ పాఠశాలలో వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి... ప్రజలను కాపాడుకునేందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చార్మినార్​ పరిధిలో..

చందానగర్ పీజేఆర్​ స్టేడియంలో ప్రభుత్వ విప్​ అరికెపూడి గాంధీ వాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. ముషీరాబాద్‌లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జీహెచ్​ఎంసీ కమిషనర్‌ లోకేశ్​కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. చార్మినార్ పరిధిలో ఏడు వాక్సినేషన్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

మరో ముందడుగు..

కరోనా కట్టడి చర్యల్లో సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ వెల్లడించారు. నాంపల్లి రెడ్‌రోస్ గార్డెన్‌, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. హైదరాబాద్​ పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వివిధ విభాగాలతో సమన్వయం చేస్తూ సజావుగా సాగేలా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యవేక్షించారు.

కేసీఆర్​ చొరవతో..

కరీంనగర్‌లోని ఉమెన్స్ హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీకా పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌... సీఎం కేసీఆర్‌ చొరవతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనా కట్టడికి కృషిచేస్తున్నామని తెలిపారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో 6,108 మంది సూపర్ స్ప్రెడర్లకు హన్మకొండ, కాజీపేట ఐనవోలు, ధర్మసాగర్, హసన్‌పర్తి కమలాపూర్, భీమదేవరపల్లి తదితర 18 కేంద్రాల్లో వ్యాక్సిన్ వేశారు. ఖమ్మం జిల్లా వైరా, ఏనుకూరు, కారేపల్లిలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఎమ్మెల్యే రాములు నాయక్​ పరిశీలించారు.

మెదక్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి.. టీకాపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. నిజామాబాద్‌, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ముందుగా టోకెన్లు పంపిణీ చేసి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇవీచూడండి: Anandaiah: 'ఆనందయ్య మందుకు అనుమతివ్వాలి.. కార్పొరేట్​కు లొంగొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.