ETV Bharat / city

Special Authority for Rivers Connection: నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ.. - Special Authority for Rivers Connection news

దేశవ్యాప్తంగా నదుల అనుసంధానాని(Special Authority for Rivers Connection) కి జాతీయ జల అభివృద్ధి సంస్థ(National Water Development Authority) కమిటీ నిర్ణయం తీసుకుంది. నదుల అనుసంధానికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ కింద అమలు చేస్తున్న ప్రాజెక్టులతో ఈ అథారిటీకి ఎలాంటి సంబంధం ఉండకూడదని కమిటీ సభ్యులు సూచించారు.

Special Authority for Rivers Connection
భారత్​లో నదుల అనుసంధానం
author img

By

Published : Nov 7, 2021, 8:07 AM IST

నదుల అనుసంధానాన్ని(Special Authority for Rivers Connection) వేగవంతం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపుదాల్చనుంది. ఇందుకు జాతీయ నదుల అనుసంధాన అథారిటీ(ఎన్‌.ఐ.ఆర్‌.ఎ)ని ఏర్పాటు చేయాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ((National Water Development Authority)) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. జాప్యం కాకుండా చూసేందుకు మొదట ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గాన్ని కోరనుంది. గత నెల 22న ఛైర్మన్‌ వెదిరే శ్రీరాం అధ్యక్షతన నదుల అనుసంధానంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది.

న్యాయశాఖ నివేదిక

నేషనల్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఆఫ్‌ రివర్స్‌(ఎన్‌.ఐ.ఆర్‌.ఐ) ఏర్పాటుపై జరిగిన ఈ సమావేశం వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై న్యాయసలహా కోరగా, ఇందుకు సానుకూలంగా ఆగస్టు 9న న్యాయశాఖ నివేదిక పంపింది. అథారిటీ(Special Authority for Rivers Connection)ని చట్టబద్ధంగా పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయాలని, అందుకు సమయం పడుతుందని, న్యాయసలహా మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా ఏర్పాటు చేయడానికి ఇబ్బంది ఉండదని ఎన్‌.డబ్ల్యు.డి.ఎ. డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌సింగ్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో ఇది పనిచేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

వాటితో సంబంధం ఉండకూడదు

జాతీయ జల అభివృద్ధి సంస్థ పునర్‌వ్యవస్థీకరణ(Special Authority for Rivers Connection) పై గతంలో ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న గోపాల్‌కృష్ణన్‌, నిపుణుల కమిటీలో సభ్యుడైన అహ్మదాబాద్‌ ఐ.ఐ.ఎం. ప్రొఫెసర్‌ వసంత్‌గాంధీ పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంతో పాటు దేశాల మధ్య అనుసంధానం కూడా ఈ అథారిటీ పరిధిలోకి వస్తుంది కనుక విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖనూ ఇందులో భాగం చేయాలని, నదుల అనుసంధానం(Special Authority for Rivers Connection) పై పూర్తి అధికారాలు ఉండాలని వారు అభిప్రాయపడ్డారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పీఎంకేఎస్​వై (ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన)కింద అమలు చేస్తున్న ప్రాజెక్టులతో ఈ అథారిటీకి ఎలాంటి సంబంధం ఉండకూడదని సూచించారు. ఈ క్రమంలో త్వరలోనే అథారిటీ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: Regional Ring Road Hyderabad: ప్రాంతీయ రింగురోడ్డు ఉత్తర మార్గం నివేదికకు కేంద్రం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.