ETV Bharat / city

ప్రేమ జంటపై తప్పుడు కేసునమోదు... ఎస్సైపై చర్యలు - టంగుటూరు ఎస్సైని వీఆర్​కు పంపిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వార్తలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై తప్పుడు కేసుపెట్టి, వరుడిని జైలుకు పంపించిన ఎస్సైపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ చర్యలు తీసుకున్నారు. నూతన దంపతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

sp-siddarth-kaushal-reacts-on-tangutoor-si-actions in prakasam dist AP
ప్రేమజంటపై తప్పుడు కేసు నమోదు... ఎస్సైపై చర్యలు
author img

By

Published : Nov 30, 2020, 11:36 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలం సర్వేరెడ్డి పాలానికి చెందిన భార్గవి, ఒంగోలులో నివాసముంటున్న సమీప బంధువైన మహేష్​ ప్రేమించి, పెద్దల అంగీకారం లేకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం భార్గవి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవి మానసిక స్థితి బాగుండదని, ఎంబీబీఎస్ చదువును కూడా ఈ కారణంగానే మధ్యలో ఆపేసిందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. బలవంతంగా ఆమెను మహేష్ పెళ్లి చేసుకున్నాడంటూ టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి చేసుకున్నాక.. భార్గవి, మహేష్ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. వారు భార్గవి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదునే.. నమోదు చేశారు. మహేష్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇద్దరూ మేజర్లు అయినా, వీరి అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో, భార్గవి ఒంగోలు వచ్చి స్పందనలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్పీ వెంటనే స్పందించి, టంగుటూరు ఎస్సైపై చర్యలకు ఉపక్రమించారు. వీఆర్​కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన దంపతులను తగిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ పనితీరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అసంతృప్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.