SP Dance for bullet song: బుల్లెట్టు బండి పాట స్టెప్పుల ఖాతాలో తాజాగా పోలీసు అధికారి కూడా చేరారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకూ అందరినీ అలరించిన ఈ పాటకు.. ఓ పోలీసు అధికారి స్టెప్పులేసి చుట్టూ ఉన్నవారిని అలరించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప.. ఆటపాటలతో సందడి చేశారు. జిల్లాలోని కంబదూరు సమీపంలోని అండేపల్లి గ్రామంలోని రామప్పకొండపై.. పోలీసు అధికారులు వన భోజనాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని పోలీసు కుటుంబాలు ఈ వనభోజనాల్లో పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ ఫక్కీరప్ప.. వారితో ఆడిపాడారు. ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన "బుల్లెట్ బండి" పాటకు నృత్యం చేసి అందర్నీ ఉత్తేజపరిచారు. వనభోజనాల సందర్భంగా ఎస్పీ చేసిన డ్యాన్సుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: Dancer Ravi kumar: రవి ఆటకు నృత్యమే మైమరచిపోయింది.. 10 వేల మందికి...