ETV Bharat / city

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

Monsoon in Kerala: సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి రుతుపవనాలు' మూడు రోజుల ముందుగానే వచ్చేశాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడ స్థిరంగా ఉన్నట్లు వాతావరణ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు.

Monsoon in Kerala
Monsoon in Kerala
author img

By

Published : May 30, 2022, 9:45 AM IST

Monsoon in Kerala: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే పలకరించాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి' మూడు రోజుల ముందుగానే వచ్చేసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడ స్థిరంగా ఉన్నట్లు వాతావరణ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతు పవనాల్లో వేగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోకి త్వరగా ప్రవేశించాయని స్పష్టం చేశారు.

రానున్న మూడు, నాలుగు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలో మరింత ముందుకు కదులుతాయి. అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతంవైపు నెమ్మదిగా పురోగమించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలోని పరిస్థితుల వల్ల అండమాన్​ నికోబార్ దీవుల్లో నెమ్మదించాయి. రుతుపవనాల ప్రభావంతో శనివారం కేరళలో పలు ప్రాంతాల్లో 2.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

కాగా జూన్ 8 నాటికి రుతుపవనాాలు తెలంగాణకు చేరతాయని అంచనా. సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఆదివారం పగలు అక్కడక్కడా ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా గరిమెళ్లపాడు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో 3 సెం.మీ, లింగాపూర్(కుమురంభీం)లో 3, నాచారం(మేడ్చల్)లో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పగటిపూట అత్యధికంగా నిడమనూరు(నల్గొండ జిల్లా)లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని గతంలోనే ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నుంచి మే 28 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా, తెలంగాణలో మాత్రం వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో రుతుపవనాల ముందస్తు ఆగమనం వ్యవసాయదారుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. 'నైరుతి' గతేడాది జూన్‌ 3న కేరళను తాకింది.

ఇవీ చూడండి :రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.