ETV Bharat / city

ఏపీ నుంచి రైల్లో సిమెంటు ముడిసరుకు.. ఇదే తొలిసారి అంటున్న దక్షిణ మధ్య రైల్వే!

దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా సిమెంటు తయారీలో వాడే ముడిసరుకు ప్లై యాష్​ను ఆంధ్రప్రదేశ్​ నుంచి తెలంగాణలోని మిర్యాలగూడకు రవాణా చేసింది. రైల్వే ఫ్లై యాష్​ను రవాణా చేయడం ఇదే తొలిసారి. గుంతకల్లు డివిజన్​ స్థాయిలో బిజినెస్​ డెవలప్​మెంట్​ యూనిట్​ను ఏర్పాటు చేసి.. సరుకు రవాణాను పెంచాలని ద.మ. రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సిమెంట్​ తయారు చేసే ముడిసరుకు ప్లై యాష్​ను ఏపీ నుంచి తెలంగాణకు రవాణా చేసింది.

author img

By

Published : Sep 12, 2020, 11:03 AM IST

South Central Railway Transport Fly Yash In First Time
తొలిసారిగా ఫ్లై యాష్​ రవాణా చేసిన ద.మ.రైల్వే!

దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా ఫ్లై యాష్ లోడింగ్​ను రవాణా చేసింది. ఆంధ్రప్రదేశ్​లోని ఎర్రగుంట్ల సమీపంలోని చిలంకూర్ ఇండియా సిమెంట్స్ ప్లాంట్​ నుంచి తడి ఫ్లై యాష్​ను రైల్వేశాఖ తెలంగాణలోని మిర్యాలగూడ విష్ణుపురం సిమెంట్​ ప్లాంట్​కు రవాణా చేసింది. ఇలా రవాణా చేయడం ఇదే మొట్ట మొదటిసారని ద.మ. రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు ఈ కంపెనీ రోడ్డు మార్గం ద్వారా రవాణా చేసేది. పోర్ట్ ల్యాండ్ సిమెంట్ కాంక్రీట్ తయారీకి ఈ ఫ్లై యాష్​ని ముడి సరుకుగా ఉపయోగిస్తారు. నిరంతర ప్రయత్నాల ఫలితంగా రైల్వే టారిఫ్ రిబీట్ కింద ప్రకటించిన రాయితీ విధానాన్ని వినియోగించుకుని ఈ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్​ను రైల్వే ద్వారా రవాణా చేశారు. ఈ విధానంలో సరుకు రవాణా వినియోగదారులకు ప్రయోజనంతో పాటు , రైల్వేకి అదనపు ఆదాయం సమకూరుతుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పర్యావరణహితంగా ఫ్లై యాష్​ని సిమెంట్​ తయారీలో వినియోగించడం అవసరంగా మారిందని వినియోగదారులు చెప్తున్నారు. కొత్తగా గుంతకల్లు డివిజన్ స్థాయిలో బిజినెస్ డెవలప్​మెంట్ యూనిట్ (బీడీయూ) ఏర్పాటు చేసి సరుకు రవాణాను అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది.

బీడీయూ​ బృందం వినియోగదారులతో తరుచుగా సమావేశమవుతూ రైల్వే ద్వారా సరుకు రవాణా చేస్తే కలిగే ప్రయోజనాలు, బోర్డు స్థాయిలో చేపట్టిన సంస్కరణల యొక్క విధివిధానాల వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తుంది. సరుకు వినియోగదారుల లబ్ది కోసం దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది ఆగస్టులో నార్మల్ టారిఫ్ రేట్లపై 40శాతం రాయితీ కల్పించింది. రైల్వేలో ఈ తరహా వినూత్న పద్ధతుల్లో రవాణా పెరుగుదలకు చొరవ తీసుకున్న గుంతకల్లు డివిజన్ అధికారులు, సిబ్బంది కృషిని ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. ఇదే కృషిని కొనసాగిస్తూ నూతన మార్గాలలో సరుకు రవాణా రంగం ఆదాయాన్ని వృద్ధి చేయాలని జోనల్, ఇతర డివిజన్ స్థాయి బీడీయూ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: 'గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఊతమిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.