235 రైళ్లు, 3,00,706 మంది ప్రయాణికులు..
మే 1 నుంచి వలస కార్మికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 235 రైళ్లను నడిపించి 3,00,706 మంది ప్రయాణికులను సొంత ప్రాంతాలకు చేర్చారు. వీటిలో తెలంగాణ రాష్ట్రంలో 146 రైళ్లలో.. 1,87,303 ప్రయాణికులను, ఆంధ్రా నుంచి 71 రైళ్లను 89,971 మంది ప్రయాణికులను, మహారాష్ట్ర నుంచి 18 రైళ్లు, 23,432 ప్రయాణికులను చేరవేశారు. ద.మ. రైల్వే మీదుగా 648 రైళ్లను నడిపించారు.
తెలంగాణలో 13, ఏపీలో 14, మహారాష్ట్రలో 3 రైల్వేస్టేషన్ల నుంచి రైళ్లు..
తెలంగాణ రాష్ట్రంలోని 13 రైల్వే స్టేషన్లలో బీబీనగర్, బొల్లారం, చర్లపల్లి, ఘట్ కేసర్, హైదరాబాద్, కాచిగూడ, కరీంనగర్, కాజీపేట, లింగంపల్లి, మహబూబ్ నగర్, నాగులపల్లి, సికింద్రాబాద్ తదితర 13 స్టేషన్లు, ఏపీ నుంచి అనంతపురం, చిత్తూరు, కడప, గూడూరు, కొవ్వూరు, కర్నూల్ టౌన్, మంగళగిరి, నంబూరు, నర్సాపూర్, నెల్లూరు, నిడుదవోలు, ఒంగోలు, రాజమండ్రి, రాయంపాడు స్టేషన్ల నుంచి, మహారాష్ట్రలోని ఔరంగబాద్, జాల్నా, నాందేడ్ స్టేషన్ల నుంచి రైళ్లను నడిపించారు.
15 రాష్ట్రాలకు చేర్చిన ద.మ. రైల్వే..
వలస కార్మికులను 15 రాష్ట్రాలకు చేరవేశారు. అసోం రాష్ట్రానికి ఒక రైలును నడిపించి 968 ప్రయాణికులను, ఛత్తీస్‌గఢ్‌కు నాలుగు రైళ్లు నడిపించి 4,949 ప్రయాణికులను, ఝార్ఖండ్‌కు 25 రైళ్లను నడిపించి 27,338 మంది ప్రయాణికులను, మహారాష్ట్రకు నాలుగు రైళ్లు నడిపించి 3,278 మంది ప్రయాణికులను, మిజోరాంకు ఒక్క రైలు ద్వారా 1,143 ప్రయాణికులను, రాజస్థాన్‌కు 10 రైళ్ల ద్వారా 9,847 ప్రయాణికులను, యూపీకి 51 రైళ్లను నడిపించి 61,517 ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చింది.
బిహార్‌కు 63 రైళ్లను నడిపించి 81,997 ప్రయాణికులను, జమ్మూకశ్మీర్‌కు ఒక్క రైలులో 983 ప్రయాణికులను, మధ్యప్రదేశ్‌కు 13 రైళ్లలో 13,216 ప్రయాణికులను, మణిపూర్‌కు నాలుగు రైళ్లలో 5,517 ప్రయాణికులను, ఒడిశాకు 40 రైళ్లలో 64,754 ప్రయాణికులను, త్రిపురకు ఒక్క రైలులో 975 ప్రయాణికులను, ఉత్తరాఖండ్‌కు ఒక్క రైలు నడిపించి 1,180 ప్రయాణికులను, బంగాకు 14 రైళ్లను నడిపించి 20,156 మంది ప్రయాణికులను చేరవేశారు.
రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే..
రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ప్రత్యేక శ్రామిక్ రైళ్లను నడిపించామని ద.మ. రైల్వే జీ.ఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ప్రయాణికులను తరలించేప్పుడు రైల్వే స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్‌లు చేయడం, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. మాస్క్‌లు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతించామని తెలిపారు. రైల్వే అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మీరు వ్యవసాయం చేస్తే... నాలా చావాల్సిందే...'