కరోనా వైరస్ విజృంభణతో నిలిచిపోయిన సర్వీసులను రైల్వేశాఖ దశలవారీగా పునరుద్ధరిస్తోంది. తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం మరో 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు సేవలందించనున్నాయి. సికింద్రాబాద్-విశాఖ, లింగంపల్లి-కాకినాడ, తిరుపతి- విశాఖపట్నం, సికింద్రాబాద్-షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 13 నుంచి ఒక్కో తేదీలో ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే విజ్ఞప్తి చేసింది.
రైళ్ల వివరాలు..
- ఈనెల 13 నుంచి ప్రతి మంగళవారం ఉ.5.40 గం.కు సికింద్రాబాద్-షాలిమార్ రైలు
- ఈనెల 14 నుంచి ప్రతి బుధవారం సా.4.05 గం.కు షాలిమార్- సికింద్రాబాద్ రైలు
- ఈనెల 14 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గం.కు తిరుపతి-విశాఖ రైలు
- ఈనెల 15 నుంచి ప్రతి గురు, శని, సోమవారాల్లో రాత్రి 10.25 గం.కు విశాఖ-తిరుపతి రైలు
- ఈనెల 17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గం.కు సికింద్రాబాద్-విశాఖ రైలు
- ఈనెల 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గం.కు విశాఖ-సికింద్రాబాద్ రైలు
- ఈనెల 26 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 7.55 గం.కు లింగంపల్లి-కాకినాడ రైలు
- ఈనెల 25 నుంచి ప్రతి మంగళ, గురు, ఆదివారాల్లో రాత్రి 8.10 గం.కు కాకినాడ-లింగంపల్లి రైలు
ఇవీ చూడండి: చట్ట సవరణల కోసం... అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు యోచన