ఆస్తి కోసం కన్నకండ్రిపైనే కర్కశత్వం చూపించాడు ఓ పుత్రరత్నం. ఆస్తి సమానంగా పంచలేదని.. భార్యతో కలిసి తండ్రిని కర్రతో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు చెందిన చంద్రన్నకు ఇద్దరు భార్యలు. మెుదటి భార్య చనిపోవటంతో వెంకటేశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. మెుదటి భార్యకు ఓ కుమారుడు, కూతురు ఉండగా.. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. చంద్రన్న అందరికీ వివాహం చేసి.. ఆస్తిని సమానంగా పంచాడు.
కాగా.. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయని మెుదటి భార్య కుమారుడు మల్లేశ్.. కొంత కాలంగా చంద్రన్నతో గొడవ పడుతున్నాడు. ఇదే విషయంలో భార్య గాయత్రితో కలిసి చంద్రన్నపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనపై రెండో భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ చదవండి: