చర్చిలకు రూ.వేల కోట్ల ఆస్తులున్నప్పుడు... ప్రభుత్వం ఎందుకు నిర్మించాలని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ ఆలయాల ఆస్తులు లెక్కించిందని.. అలాగే చర్చిల ఆస్తులు కూడా లెక్కించాలన్నారు. రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులిచ్చే అంశంపై కేంద్రానికి నివేదిస్తామన్నారు.
ఆలయాలపై దాడులు జరిగితే ఒక్క కేసు పెట్టలేదని ఆగ్రహించారు. భాజాపా కార్యకర్తలపై బూటకపు కేసులు నమోదు చేస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. హిందూత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిల ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మేడారం చిన్న జాతర