ETV Bharat / city

ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఓ విమానం..! - one plane per house news

మన దగ్గర ఏ ఊళ్లోనైనా ప్రతి ఇంటికీ ఓ కారు ఉంటేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... అమెరికాలోని కొన్ని గ్రామాల్లో ఏకంగా ప్రతి ఇంటికీ ఓ విమానం ఉంటుందట. వీటినే అక్కడ ఫ్లైయింగ్‌ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. ఆ కథేంటో చూద్దామా...

sunday magazine, aeroplane
ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఓ విమానం..!
author img

By

Published : Mar 28, 2021, 2:48 PM IST

జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలన్నది మనదేశంలో ఇప్పటికీ ఎంతోమందికి నెరవేరని కలే. ఎగువ మధ్యతరగతి వాళ్లు కూడా మరీ అత్యవసరమైతేనో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయంలోనో తప్ప తరచూ విమానం ఎక్కడం అరుదే. విమాన ప్రయాణం అంత ఖరీదైంది మరి. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘కామెరన్‌ ఎయిర్‌పార్క్‌ ఎస్టేట్స్‌’లో మాత్రం ప్రతి ఇంటి ముందూ చిన్నసైజు విమానం ఉంటుంది. కొన్ని ఇళ్ల ముందు రెండు మూడు విమానాలూ కనిపిస్తాయి. మనకు కార్లకు గ్యారేజీలున్నట్లే వాళ్లు విమానాలను నిలుపుకునేందుకు ఇంటి ఆవరణలో హ్యాంగర్లను నిర్మించుకుంటారు. అంతేకాదు, కొందరు ఆఫీసులక్కూడా ఈ విమానాల్లోనే వెళ్లి వస్తుంటారు. ఆఫీసుకి దగ్గర్లో ఉన్న విమానాశ్రయంలో తమ విమానాలను నిలిపి మళ్లీ సాయంత్రం ఇంటికి వేసుకొస్తారట. దీనివల్ల బోలెడంత ప్రయాణ సమయం కలిసొస్తుంది అంటారు.

అక్కడ ఇంటింటికీ విమానం..!

ఇలాంటివెన్నో...

నిజానికి ఇలా ఇంటింటికీ విమానం ఉన్న కమ్యూనిటీలు ప్రపంచవ్యాప్తంగా ఆరువందలకు పైగా ఉంటే అందులో ఒక్క అమెరికాలోనే 426 ఉన్నాయట. మొదట్లో- రెండో ప్రపంచయుద్ధం సమయంలో వైమానిక దళంలో పనిచేసినవాళ్లు తమకోసం ప్రత్యేకమైన ఫ్లైయింగ్‌ కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత్తర్వాత విమానాలంటే బాగా ఆసక్తి ఉన్నవాళ్లూ పైలట్లూ కూడా ఆ కమ్యూనిటీల్లో చేరడంతో మరెన్నో రెసిడెన్షియల్‌ ఎయిర్‌పార్కులు పుట్టుకొచ్చాయి. అయితే, కామెరన్‌ ఎస్టేట్‌కి ప్రపంచంలోనే అందమైన ఎయిర్‌పార్క్‌గా గుర్తింపు ఉంది. అందుకే, ఈమధ్య ఇది సోషల్‌ మీడియాలోనూ బాగా వైరల్‌ అయింది. ఇక, ఈతరహా ఎయిర్‌పార్కుల్లో ప్రతిచోటా చిన్న విమానాశ్రయం ఉండి ఆ చుట్టూ ఇళ్లు ఉంటాయి. చోదకులు ఆ రన్‌వే మీద ల్యాండ్‌ అయ్యి నేరుగా తమ ఇంటి ముందుకే విమానాన్ని తీసుకెళ్లిపోవచ్చు. అందుకే, ఈ ఎయిర్‌పార్కుల్లో రోడ్లు వెడల్పుగా ఉంటాయి. కామెరన్‌ ఎయిర్‌పార్కునే తీసుకుంటే ఇక్కడి రోడ్ల వెడల్పు వంద అడుగులు. విమానాలతో పాటు ఎయిర్‌పార్కుల్లో ఉండేవారి కార్లు కూడా ఒకేసారి ఇబ్బంది లేకుండా ఇంటివరకూ నడిచేందుకే రోడ్లను ఇలా నిర్మిస్తారు.

ప్రతి ఇంటికీ ఓ విమానం ఉంటుందంటేనే ఫ్లైయింగ్‌ కమ్యూనిటీల్లో ఉండేవాళ్లు ఎంత ధనవంతులో అర్థం చేసుకోవచ్చు. అలా అని డబ్బుండి సొంతంగా విమానం ఉన్నవాళ్లందరికీ ఎయిర్‌పార్కుల్లో ఉండే అవకాశం దొరకదట. ఎందుకంటే, ఈ పార్కుల్లో వందా రెండొందల సంఖ్యలోనే ఇళ్లు ఉంటాయి. కొత్తవాళ్లు ఎవరైనా అక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే అప్పటికే ఉండేవారెవరైనా ఖాళీ చేస్తేనో చనిపోతేనో తప్ప అవకాశం దొరకదు. అందుకే ఇళ్ల ధర కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పోల్చితే ఎక్కువే. కామెరన్‌ పార్క్‌లో ఈమధ్య ఓ ఇల్లు అమ్మకానికి రాగా సుమారు రూ.11 కోట్లు పలికిందట. ఇలాంటి కమ్యూనిటీలు కూడా ఉంటాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!

అక్కడ ఇంటింటికీ విమానం..!
అక్కడ ఇంటింటికీ విమానం..!
అక్కడ ఇంటింటికీ విమానం..!

ఈల వేయాలంటే... పర్మిషన్‌ ఉండాలంతే!

అక్కడ ఇంటింటికీ విమానం..!

స్టార్‌ హీరో చిత్రం... మొదటి రోజు మొదటి షో. కథానాయకుడిని చూపించే ఓపెనింగ్‌ సీన్‌లో ఎన్ని ఈలలు వినిపిస్తాయో కదా! కానీ ఆ థియేటర్‌లో అలా ఈలవేయాలంటే ముందుగా పర్మిషన్‌ తీసుకోవాలి. ఆ అనుమతి కూడా సినిమాలో ఏదో రెండు సీన్లకి మాత్రమే ఇస్తారు. ఈ చోద్యం ఎక్కడా అనుకుంటున్నారా... ఊటీలోని అసెంబ్లీ రూమ్స్‌ థియేటర్‌లో. మనదేశంలోని అతిపాత సినిమా హాళ్లలో ఇదీ ఒకటి. 1924 నాటిది. ఒకప్పుడు నీలగిరిలోని బ్రిటిష్‌ సైనికుల వినోదం కోసం ఓ బాల్‌రూమ్‌లా ఉపయోగపడేదీ ‘అసెంబ్లీ రూమ్స్‌’ హాలు. ఆ హాలుని 1923లో నాటి భారతదేశ వైస్రాయ్‌ వెల్లింగ్టన్‌ భార్య లేడీ వెల్లింగ్టన్‌ 50 వేల రూపాయలకి కొని... ఊటీ ప్రజల వినోదానికని ఇచ్చేశారట. ఆ తర్వాతి ఏడాది దీన్ని సినిమా హాలుగా మార్చారు. స్వాతంత్య్రం తర్వాత నుంచీ తమిళనాడు ప్రభుత్వం దీనికి నామమాత్రపు యజమానిగా ఉంటూ వస్తోంది. వైస్రాయి భార్య దీన్ని ప్రజల కోసమే ఇచ్చారు కాబట్టి ఇందుకోసం ఏర్పడ్డ ఊటీవాసుల ట్రస్టే దీన్ని నిర్వహిస్తోంది. ఆ రకంగా మనదేశంలో ప్రభుత్వ అధ్వర్యంలో ప్రజల కోసం ప్రజలే నిర్వహించే ఏకైక థియేటర్‌ ఇదే. అప్పటి నుంచీ ఇప్పటిదాకా అలనాటి బ్రిటిష్‌ మర్యాదల్ని పాటిస్తూ వస్తున్నారు. ఎంత మాస్‌ సినిమా అయినా సరే, ఈ థియేటర్‌లో ప్రేక్షకులు ఈలలు వేయడానికి అనుమతించేవారు కాదు! కానీ 1984లో దాన్ని కాస్త సడలించారు. ఎందుకంటే... ఆ ఏడాది కె.విశ్వనాథ్‌ ‘సాగరసంగమం’ సినిమాని తమిళంలో ‘సలంగై ఒళి’ అన్న పేరుతో డబ్‌ చేశారు. కమల్‌హాసన్‌ సినిమా కదా... అభిమానులు ఈలలు వేయకుండా ఉండలేకపోయారు. సహజంగానే ఇక్కడి నిర్వాహకులు అభ్యంతరాలు చెప్పారు. దాంతో ఓ అభిమాని ఈ సినిమాలోని ఓ రెండు సీన్ల కోసం ఈలలు వేయడానికి అనుమతించాలని కోరుతూ ఈ థియేటర్‌ ట్రస్టు అధ్యక్షుడిగా ఉన్న కలెక్టర్‌ని కోరారు. ఆయన అనుమతించడంతో ఆ రెండు సీన్లకి ఈల వేయడానికి అనుమతించారు. అప్పటి నుంచీ- ముందుగా అనుమతి తీసుకుని, కేవలం రెండు సీన్లకే ఈల వేసే ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతూ వస్తోంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.