విద్యుత్ ఆదా చేసేందుకు ఆ గృహ సముదాయ యజమానుల సంఘం వినూత్నంగా ఆలోచించింది. సమష్టిగా కృషి చేసి గృహ సంక్షేమ నిధులు సమీకరించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నగర శివారులోని గిరిధారి గృహ సముదాయ యజమానుల సంఘం సభ్యులు రూ.3.76 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ నిర్మించుకుంది. దీని నుంచి ప్రతి నెల 85,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ప్రతి నెల లక్షల రూపాయల విద్యుత్ ఆదా చేసుకుంటూ ఇతర గృహ సముదాయాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సోలార్ ప్లాంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ వివరిస్తారు
- ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వర్షబీభత్సం.. 114కు చేరిన మృతులు