ETV Bharat / city

పాఠశాలలో సౌర విద్యుత్.. నెలవారీ​ బిల్లులకు చెక్!

author img

By

Published : Feb 28, 2021, 3:56 PM IST

ఒకప్పుడు ఐదు వేల రూపాయలకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఆ పాఠశాల నేడు దాదాపు 20 గదులకు సరిపడా విద్యుత్ వినియోగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. అదెలా సాధ్యం అంటారా.! అంతేకాదు పాఠశాలకు సరిపడా విద్యుత్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మిగులు విద్యుత్​ను విద్యుత్​ శాఖ గ్రిడ్​కు అనుసంధానించారు. ఇదంతా ఎలా సాధ్యం అయ్యింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

solar power in andhra pradesh
పాఠశాలలో సౌర విద్యుత్.. నెలవారీ​ బిల్లులకు చెక్!
పాఠశాలలో సౌర విద్యుత్.. నెలవారీ​ బిల్లులకు చెక్!

ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. సూర్యరశ్మిని ఒడిసిపట్టి విద్యుత్ అవసరాలను తీర్చుకుంటోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 4 సోలార్ ప్యానెల్​లు పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానల్ నుంచి రోజుకు నాలుగు యూనిట్లు చొప్పున మొత్తంగా 16 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

ఈ సోలార్ యూనిట్​ను విద్యుత్ శాఖ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఫలితంగా పాఠశాల అవసరాలకు మించి ఉత్పత్తి అయిన కరెంట్.. గ్రిడ్ ద్వారా బయటకు పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ ఉత్పత్తి తక్కువయితే దాన్ని తిరిగి పాఠశాలకు సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.

పాఠశాలలో మొత్తం 650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి అవసరాలకు 20 తరగతి గదులు ఉన్నాయి. ప్రతి గదిలో ఐదు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఈ సౌర విద్యుత్ ద్వారానే పనిచేస్తున్నాయి.

5 వేల రూపాయలు ఆదా..

గతంలో ఫ్యాన్లు, లైట్లు పరిమిత సంఖ్యలో ఉన్నా.. నెలకు ఐదు వేల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించామని.. ప్రస్తుతం సోలార్ ప్యానల్ ఏర్పాటుతో ఒక్క రూపాయ చెల్లించనవసరం లేకుండా పోయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆళ్ల రాంబాబు తెలిపారు. సోలార్ ప్యానల్​కు పదేళ్ల వరకు ఎటువంటి నిర్వహణ ఖర్చులు ఉండవని.. తద్వారా పదేళ్లపాటు పాఠశాలకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి: హైద‌రాబాద్‌లో ఐపీఎల్ నిర్వ‌హించండి : మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.