ETV Bharat / city

snake: ఫ్రిజ్​ డోర్ తెరవగానే లోపల నల్లత్రాచు బుసలు కొడుతోంది!

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడి లంక గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్​లోకి నల్లత్రాచుపాము దూరింది. దీంతో వారు కంగారుపడ్డారు. కొద్దిసేపటికి స్నేక్ క్యాచర్ పామును పట్టుకున్నారు.

author img

By

Published : Jul 25, 2021, 3:50 PM IST

snake-in-fridge-at-pasarlapudi
snake-in-fridge-at-pasarlapudi
ఫ్రిజ్​లో పాము.. పరుగులు తీసిన కుటుంబ సభ్యులు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఫ్రిజ్‌లో దూరిన ఓ పాము అందరిని హడలెత్తించింది. పాసర్లపూడి లంక గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో.. కూరగాయలు తీసుకునేందుకు మహిళ ఫ్రిజ్‌ డోరు తీయగా.. బుసలు కొడుతున్న తాచుపాము దర్శనమిచ్చింది. ఉలిక్కిపడిన ఆమె... డోరు వేయకుండానే భయంతో పరుగులు తీసింది. ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. దొరక్కపోవడంతో ఇంట్లోవారు, స్థానికులు భయంతో అల్లాడిపోయారు.

స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తి ప్రకాశరావు వచ్చి.. చాకచక్యంతో పామును పట్టి సంచిలో బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తాచుపామును జనసంచారం లేని ప్రాంతంలో విడిచిపెట్టినట్టు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి:

Lashkar Bonalu : లష్కర్ బోనాలు.. పోటెత్తిన భక్తులు.. ప్రముఖుల సందర్శనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.