ఐ బ్రోస్ పెరిగినట్టయితే ఎలక్ట్రికల్ పెన్స్ అందుబాటులోకి వచ్చాయి. లేదంటే ట్వీజర్స్‌నీ ఎంచుకోవచ్చు. అయితే సరిగా తీయడం రాకపోతే దీనివల్ల చర్మం రాపిడికి గురవుతుంది. కాస్త ప్రాక్టీస్ చేస్తే త్రెడ్డింగ్ సులువుగానే ఉంటుంది. ఇందుకోసం ఎలక్ట్రికల్ త్రెడ్డర్స్‌ని వాడొచ్చు.
ఫేషియల్‌గా పాలు, తేనె కలిపి ఫేస్‌ప్యాక్‌లా చేసుకుంటే సరిపోతుంది. పసుపులో రోజ్ వాటర్ కలిపి కూడా ట్రై చేయవచ్చు. ఓట్స్, తేనె, ఆలివ్ ఆయిల్‌ను మిశ్రమంగా తీసుకుని ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో చర్మం నిగారింపు కోల్పోదు.
ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్, కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి కాళ్లు పెట్టాలి. పాదాల సంరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. సెనగపిండి, పాలు, పసుపు, తేనె కలిపి పేస్టులా చేసి కాళ్లకు ప్యాక్‌లా వేయాలి. పదినిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను చేతులకు కూడా వేసుకోవచ్చు.