DIVYANGS MARRIAGE: ఒకరు మానసిక వికలాంగురాలు.. మరొకరు రెండు కాళ్లు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న దివ్యాంగుడు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ ఇద్దరికీ తమ సొంత ఖర్చులతో ఏపీ విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామస్తులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఒకరు పిండి వంటలు చేసి అందిస్తే.. కొంతమంది ఒకటిన్నర తులాల పుస్తెలతాడు, సారె సామగ్రి సమకూర్చారు. గ్రామ సర్పంచ్ దూల తిరుపతిరావు మూడు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మిగిలిన వారు తమకు తోచిన సహాయాన్ని అందించారు.
సిరిపురం గ్రామానికి చెందిన పొట్నూరు మహాలక్ష్మి పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. ఈమె తల్లిదండ్రులు సూరి, రవణమ్మ కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. సిరిపురం పంచాయితీలోని బలరాంపేట గ్రామానికి చెందిన బోర అన్న నాయుడు 2017 లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వీరికి వివాహం చేయాలని రెండు గ్రామాల పెద్దలు, ఉద్యోగస్తులు నిర్ణయించి ముందుకు వచ్చారు. వీరికి వివాహం జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమకు జీవితం ప్రసాదించిన గ్రామస్తులకు రుణపడి ఉంటామని వధూవరులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Sadguru on green india challenge: 'తెలంగాణ బిగ్ గ్రీన్‌స్పాట్‌గా మారింది'
130ఏళ్ల చెట్టుపై 'మెర్క్యూరీ' దాడి.. నలుగురు డాక్టర్ల స్పెషల్ ట్రీట్మెంట్తో...