కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకానికి ఏపీలోని సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఎంపికైంది. ఈ మేరకు ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్రం సమాచారం పంపింది.
ప్రసాద్‌గా వ్యవహరించే ఈ పథకం ద్వారా వచ్చే నిధులను యాత్రికుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. దీని కింద సింహాచలం దేవస్థానానికి రూ.53 కోట్లు నిధులు వస్తాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు.
సంచైత గజపతి హర్షం
అప్పన్న సన్నిధిని ప్రసాద్ పథకానికి ఎంపిక చేసినందుకు ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ సంచైత గజపతి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీచూడండి: కరోనా కాలం: ఈసారి నిరాడంబరంగానే వినాయక చవితి వేడుకలు