కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర 32 పంపుహౌస్‌ల నిర్వహణకు షార్ట్ టెండర్లు పిలవాలని... అందుకు అనుగుణంగా అంచనాలు ఖరారు చేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీర్లతో రజత్‌కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించారని.... ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో పూర్తిస్థాయిలో సిద్ధం కావాలన్న రజత్ కుమార్.. చివరి ఆయకట్టు వరకు నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
చెక్‌డ్యాం పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఉపాధిహామీ నిధులతో చేపట్టిన చెరువులు, కాల్వల పూడికతీత, ఇతర మరమ్మత్తులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఇంజినీర్లను రజత్‌కుమార్ ఆదేశించారు.
ఇవీ చూడండి: ktr: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది: కేటీఆర్