ETV Bharat / city

శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - Gaja Vahana Seva at Srisaila Devasthanam

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు సతీ సమేతుడైన మల్లన్న గజవాహనంపై పుర వీధుల్లో ఊరేగారు. గురువారం శివరాత్రి పర్వదినాన్ని శేష పూజలు నిర్వహించనున్నారు.

shivaratri-brahmotsavam-in-srisailam-temple-at-kurnool-district
శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
author img

By

Published : Mar 11, 2021, 3:51 AM IST

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగం ఏడో రోజు బుధవారం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో సతీ సమేతుడైన మల్లన్నకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు.

సతీ సమేతుడైన మల్లన్న సాయంత్రం గజవాహనంపై పుర వీధుల్లో ఊరేగారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గురువారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, తలపాగా కార్యక్రమం అనంతరం కల్యాణం నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​లకు పదోన్నతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.