హైదరాబాద్‌ని అత్యంత భద్రత గల నగరంగా మార్చడమే పోలీసుల లక్ష్యం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన 'షీటీమ్స్' 5వ వార్షికోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రసిద్ధి చెందిన బహుళజాతి ఐటీ సంస్థలు హైదరాబాద్‌కి రావడానికి ఇక్కడ ఉన్న భద్రతా పరిస్థితులే కారణమని అన్న ఆయన... మహిళల భద్రతే తమ ధ్యేయం అన్నారు. 'షీటీమ్స్' 'భరోసా సెంటర్' ద్వారా ఎంతో మందికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని త్వరలో పాతబస్తీలో భరోసా సెంటర్‌ని ప్రారంభిస్తామని సీపీ తెలిపారు. షీటీమ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రిలీఫ్ మాన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నారని ఆయన కొనియాడారు. షీటీమ్స్ వచ్చిన తర్వాత చాలా వరకు మహిళలపై జరుiగుతున్న నేరాలు తగ్గాయని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సైబర్ నేరాలను కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని పోలీసులను ఆయన కోరారు.
షీటీమ్స్‌కు ఐదేళ్లు: చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం
షీటీమ్స్‌ను ఏర్పాటు చేసిన 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నగర సీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, యూఎస్ కాన్సులేట్ జనరల్, అదనపు సీపీ షికా గోయల్ హాజరయ్యారు.