ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రులు - విజయవాడ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

sharannavarathrulu-third-day-lord-durgamma-appears-as-gayathri-devi-in-vijayawada
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రులు
author img

By

Published : Oct 19, 2020, 6:48 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్మాతను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు.

గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ... దర్శించడం వల్ల సకల మంత్రసిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. మూడోరోజున విశిష్ఠత దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కేరళ సంగీత విభావరి భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందాన్నిచ్చిందని భక్తులు తెలిపారు. విజయవాడకు చెందిన ఓ ఎన్​ఆర్​ఐ... 45 లక్షల రూపాయల విలువైన ఏడువారాల నగను అమ్మవారికి కానుకగా సమర్పించారు.

ఇదీ చదవండి: వార్డుల్లోకి నీళ్లు రానివ్వకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.