ETV Bharat / city

పేరొకటి.. పని నడిచేదొకటి... పరిశ్రమల భూముల్లో ఇతర కార్యకలాపాలు - హైదరాబాద్ సెజ్ ల్యాండ్

ఐడీఏ నాచారం పరిధిలో మైనింగ్‌ సంస్థ పేరిట తీసుకున్న భూమిలో ప్రైవేట్‌ ఆసుపత్రి నడుస్తోంది. దాని పక్కనే ఇప్పుడు మరిన్ని శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ వ్యవహారమంతా ‘ఐలా’కు తెలియదా అంటూ స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Sez
Sez
author img

By

Published : Sep 4, 2020, 9:06 AM IST

హైదరాబాద్‌ నగరంలోని అనేక పారిశ్రామికవాడలు అటు అభివృద్ధికి ఊతమిస్తూ, ఇటు లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే యాజమాన్యాలను ప్రభుత్వమూ ప్రోత్సహిస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకొని అక్రమార్జనకు తెరతీస్తున్నారు కొందరు. పరిశ్రమల పేరుతో సెజ్‌ల భూములు తీసుకుని వాటిలో వ్యక్తిగత కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్‌ఐఐసీ)కి చెందిన స్థలాలనూ కబ్జా చేసేస్తున్నారు. కొన్నిచోట్ల వీటిలో నివాస సముదాయాలు, హోటళ్లు నడుస్తున్నాయి.

గడువు దాటినా అంతే..!

నిబంధనల ప్రకారం టీఎస్‌ఐఐసీతో ఒప్పందం పూర్తయిన రెండేళ్లలో పరిశ్రమల స్థాపన జరగాలి. ఒకవేళ ఆ పరిశ్రమ కొనసాగకపోయినా ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ కింద యాజమాన్య హక్కులను బదిలీ చేయించుకొని ఆ సంస్థ కూడా వ్యక్తిగత అవసరాల కోసం భూమిని వాడుకోకూడదు. నగర పరిధిలో ఉన్న కాటేదాన్‌, జీడిమెట్ల, బాలాపూర్‌, పాశమైలారం, గాజులరామారం, నాచారం, ఉప్పల్‌, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లో వందల సంఖ్యలో భూములు ఖాళీగా ఉండటంతో పాటు దుర్వినియోగమవుతున్నాయి. నివాస సముదాయాలు ఎక్కువగా ఉన్న ఐడీఏ నాచారం, మల్లాపూర్‌, కాటేదాన్‌ తదితర ప్రాంతాల్లో అనుమతులు ఒకదానికి ఉంటే నడిచేవి వేరేవి కనిపిస్తున్నాయి.

అంతా తెలిసే..

పారిశ్రామికవాడల్లో వివిధ ఉత్పత్తుల తయారీ పేరుతో భూములు తీసుకుని పాఠశాలలు, ఆసుపత్రులు, షోరూంలు నిర్వహించేందుకు అద్దెకిస్తున్నారు. గడువు ముగిస్తే స్థానిక అధికారుల చేతులు తడిపి యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కొన్ని సంస్థలు తమకిచ్చిన స్థలాలు దాటి టీఎస్‌ఐఐసీకి చెందిన స్థలాల్లో ఇనుపకంచెలు ఏర్పాటు చేసుకుని పనులు కొనసాగిస్తున్నాయి. గతంలో ఈ భూములను ఏకంగా తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఘటనలు బయటపడ్డాయి. భూ యాజమాన్య హక్కులు రానప్పటికీ కుదవపెట్టడంతో తిరిగి వాటిని స్వాధీనం చేసుకోలేని పరిస్థితి.

మచ్చుకు కొన్ని పరిశీలిస్తే..

  • మల్లాపూర్‌ ప్రధాన రహదారిని ఆనుకుని విద్యుత్తు నియంత్రికల తయారీ సంస్థ పేరుతో 2016లో తీసుకున్న ఓ సెజ్‌ భూమిలో ప్రస్తుతం ప్రయివేటు పాఠశాల ఉంది. దాదాపు మూడు, నాలుగేళ్ల క్రితమే భూమి చేతులు మారింది. యాజమాన్య హక్కులు మాత్రం ఆ తయారీ సంస్థ పేరిటే ఇంకా ఉన్నాయి.
  • ఐడీఏ నాచారం పరిధిలోనే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థలాన్ని ఓ ఇంజినీరింగ్‌ సంస్థ లీజుకు తీసుకుంది. ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు మొదలుపెట్టకపోగా.. కొంతకాలం క్రితం అందులోనే ఓ షోరూం ఏర్పాటైంది.
  • కాటేదాన్‌ పారిశ్రామికవాడలో దాదాపు 654 పరిశ్రమలు నడుస్తున్నాయి. కొన్నింటిలో ఇంజినీరింగ్‌, మెకానికల్‌ సంస్థల పేరిట లీజుకు తీసుకుని బార్లు, హోటళ్లు నడిపిస్తున్నారు.

ఇదీ చదవండి: పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.