ETV Bharat / city

TS Assembly approved 8 Bills: అసెంబ్లీలో 8 బిల్లులకు ఆమోదం

శాసనసభలో ఎనిమిది బిల్లులను శానసభ ఆమోదించింది. ఆయా బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టగా... వాటిపై చర్చ జరిగిన అనంతరం బిల్లులకు శాసనసభ ఆమోదం లభించింది. ఇందులో కీలకమైన అటవీ విశ్వవిద్యాలయం, పురపాలక చట్ట సవరణ బిల్లు కూడా ఉన్నాయి.

telangana assembly 2022 latest news
telangana assembly 2022 latest news
author img

By

Published : Sep 13, 2022, 3:21 PM IST

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 8 బిల్లలకు సభ్యులు ఆమోదం తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ వచ్చిందన్న మంత్రి... రాష్ట్రం ఆయనకు రుణపడి ఉంటుందని వివరించారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును తలసాని ప్రవేశపెట్టగా... జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లును మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదించారు.

అటవీశాస్త్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్ట సవరణ బిల్లు, డీఎంఈ, అదనపు డీఎంఈల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు బిల్లును శాసనసభ ఆమోదించింది. అజమాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. 25శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించేలా ప్రత్యేక నిబంధన పెట్టినట్లు వెల్లడించారు. వీటన్నింటికి సభ్యులు మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.