ప్రజా ప్రతినిధుల కేసులను విచారణ జరిపే ప్రత్యేక కోర్టు జడ్జి సీహెచ్వీఆర్ఆర్. వరప్రసాద్ బదిలీ అయ్యారు. వరప్రసాద్‌ను సీబీఐ ఒకటో అదనపు ప్రత్యేక కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు నూతన జడ్జిగా కె.జయ కుమార్ నియమితులయ్యారు. జయ కుమార్ ప్రస్తుతం వరంగల్ జిల్లా ఒకటో అదనపు సెషన్స్ కోర్టు జడ్జిగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది సీనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ సివిల్ జడ్జిల నుంచి సీనియర్ సివిల్ జడ్జిలుగా పదోన్నతి పొందిన మరో తొమ్మిది మందికి పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల వర్గీకరణ పూర్తి