ETV Bharat / city

లండన్​లో ముగిసిన.. విత్తన గణపతి నిమజ్జనం! - గణేష్​ నవరాత్రి ఉత్సవాలు

లండన్​లోని రీడింగ్​ నగరంలో హైదరాబాద్​ ఫ్రెండ్స్​ యూత్​ ఆధ్వర్యంలో విత్తన గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్టు యూత్​ అధ్యక్షులు అశోక్​ గౌడ్​ తెలిపారు. జోగినపల్లి సంతోష్​ రావు స్ఫూర్తితోనే ఈ ఏడాది విత్తన గణపతిని ప్రతిష్టించినట్టు ఆయన తెలిపారు.

Seed ganesh Immersion in London reading city
లండన్​లో ముగిసిన.. విత్తన గణపతి నిమజ్జనం!
author img

By

Published : Sep 3, 2020, 3:17 PM IST

హైదరాబాద్​ ఫ్రెండ్స్​ యూత్​ ఆధ్వర్వంలో లండన్​లో నిరాడంబరంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. లండన్​లోని రీడింగ్​ నగరంలోఎనిమిది సంవత్సరాలుగా గణేష్​ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు చేసి.. భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కరోనా నిబంధనల వల్ల గణపతి నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించినట్టు యూత్​ అధ్యక్షులు అశోక్​ గౌడ్​ తెలిపారు. ఎంపీ జోగినపల్లి సంతోష్​ స్ఫూర్తితో ఈ ఏడాది విత్తన గణపతిని ప్రతిష్టించి పూజలు చేసినట్టు ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు బాధ్యతగా ఇకపై ప్రతి ఏడాది విత్తన, మట్టి గణపతినే ప్రతిష్టిస్తామని ఆయన తెలిపారు. విత్తన గణపతిని ఇంటి ఆవరణలోనే తొట్టిలో నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.