అయోధ్య తీర్పు నేపథ్యంలో నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని... సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. హోంగార్డు నుంచి కమిషనర్ వరకు 10 రోజుల నుంచి 24 గంటలు అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. రేపు జరిగే మిలాద్ ఉన్ నబీ ర్యాలీ దృష్ట్యా... అన్ని జోన్లలో బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఆయా జోన్లలో ఉన్న పోలీస్ అధికారులతో ఎప్పటికికప్పుడు అప్రమత్తం చేస్తూ చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే హైదరాబాద్కి మంచి పేరు ఉందని... ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆందోళనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఇవీ చూడండి: అయోధ్య తీర్పు: వివాదాస్పద భూమి హిందువులదే