మినీ పురపోరు సందర్భంగా మద్యం అమ్మకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఎస్ఈసీ... 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు వరకు మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు.
ఆయా పట్టణాల్లో ఎలాంటి బెల్టు షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్న పార్థసారధి... ప్రైవేట్ వ్యక్తుల వద్ద అనుమతికి మించి స్టాకు ఉండరాదని తెలిపారు. గతంలో జరిగిన అమ్మకాలతో ప్రస్తుత అమ్మకాలను క్షుణ్ణంగా పరిశీలించాలని... యాభై శాతానికి మించి అమ్మకాలుంటే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ మద్యం తయారీ, సరఫరాను నియంత్రించాలన్న ఎస్ఈసీ... ప్రత్యేక బృందాల ద్వారా చెక్ పోస్టులు, సంచార వాహనాలను ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణా చేసే వాహనాలను జప్తు చేయాలని చెప్పారు. ప్రతి పట్టణానికి ఎక్సైజ్ శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని పార్థసారధి వివరించారు.
ఇదీ చూడండి : 1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్