రేషన్ వాహనాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ అప్పీల్‌కు వెళ్లింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది. పరిశీలించిన స్వీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఏం జరిగిందంటే..
రేషన్ బియ్యం పంపిణీ వాహనాల రంగులపై పలు పార్టీలు అభ్యంతరం తెలిపిన కారణంగా వాహనాల రంగులు తొలగించాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ శశిధర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం... రేషన్ వాహనాల రంగులపై ఎస్‌ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: ప్రతి గ్రామంలో శివాజీ విగ్రహం పెడతాం: బండి సంజయ్