ETV Bharat / city

మూడో దశ ముప్పు.. ముందే గుర్తించొచ్చంటోన్న శాస్త్రవేత్తలు - corona third wave threat to India

ఏడాది పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా రెండో దశలోనూ తన పంజా విసురుతోంది. తెలంగాణలో రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో భారత్​లోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశముందని చెబుతున్నారు.

corona news, corona third wave, corona third wavein telangana, corona third wave in India
తెలంగాణలో కరోనా, తెలంగాణలో కరోనా మూడో దశ, భారత్​లో కరోనా మూడో దశ
author img

By

Published : Apr 19, 2021, 6:56 AM IST

కొవిడ్‌ రెండో దశ (వేవ్‌) కోరలు చాస్తోంది. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రెండో దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదనే భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. రెండో దశే మాత్రమే కాదు.. విదేశాల్లో ఎదురైన అనుభవాలతో మన దేశంలోనూ మూడో దశ రావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడో దశ ముప్పును ముందే గుర్తించే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు అంటున్నారు.

కరోనా సోకిన వారి నాసికా ద్రవాలు, నోటి మార్గాల ద్వారానే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్‌ బహిర్గతవుతుందని.. మురుగునీటి విశ్లేషణ ద్వారా నెల రోజుల్లో వ్యాప్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఐఐసీటీ, సీసీఎంబీలు కలిసి గత ఆగస్టులో కొవిడ్‌ మొదటి ఉద్ధృతి సమయంలో హైదరాబాద్‌లో అధ్యయనం చేశాయి. నగరంలో 6.6 లక్షల మందికి కరోనా సోకిందని, నెల రోజుల వ్యవధిలో సాధారణ స్థితికి వచ్చిందని గుర్తించారు. ఈ పరిశోధనను మరింత విస్తృతపర్చి ఐఐసీటీలోని బయో ఇంజినీరింగ్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ ల్యాబ్‌ ప్రామాణిక అధ్యయన పద్ధతిని అభివృద్ధి చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.