ETV Bharat / city

'అసలు స్టైరీన్‌ ఎలా విడుదలైందో తేల్చలేదు' - ఎల్జీ పాలిమర్స్

ఆంధ్రప్రదేశ్ ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన జరిగి నెల గడుస్తున్నప్పటికీ.. స్టైరీన్‌ ఏ గొట్టం నుంచి విడుదలైందో ఇప్పటికీ నిర్ధారించలేకపోయారని సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌ బృందం ఆక్షేపించింది.

lg polymers
'స్టైరీన్‌ ఎలా విడుదలైందో తేల్చలేదు'
author img

By

Published : Jun 10, 2020, 11:17 AM IST

ఏపీ ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటన జరిగి నెల గడుస్తున్నప్పటికీ.. స్టైరీన్‌ ఏ గొట్టం నుంచి విడుదలైందో ఇప్పటికీ నిర్ధారించలేకపోయారని ప్రజల కోసం శాస్త్రవేత్తల (సైంటిస్ట్స్‌ ఫర్‌ పీపుల్‌) బృందం ఆక్షేపించింది. ట్యాంకు పైకప్పులో ఏ గొట్టాలు అమర్చారు? వాటికి అమర్చిన కవాటాలేవి? తదితర ప్రాథమిక అంశాలపై కూడా ఉన్నతస్థాయి కమిటీకి అవగాహన కొరవడిందని విమర్శించింది. ఈ కమిటీలో సమతుల్యత లేకపోవటం, పరిశ్రమ, భద్రతారంగ నిపుణులకు స్థానం లేకపోవటమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ఈ మేరకు బృందం ప్రతినిధి డాక్టర్‌ కె.బాబురావు, ఇతర సభ్యులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

నివేదిక సమర్పణ గడువు పొడిగింపు

ఎల్జీ పాలిమర్స్‌ దుర్ఘటనపై విచారిస్తున్న ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులనిచ్చింది. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఈ నెల 7నాటికి నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.