ETV Bharat / city

మోగిన బడి గంట... విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసేనంట..!

author img

By

Published : Feb 1, 2021, 9:14 PM IST

రాష్ట్రంలో బడి గంట మోగింది. పది నెలల విరామం తర్వాత విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా జాగ్రత్తల మధ్య తరగతులు జరిగాయి. పాఠశాల, కళాశాలల్లో మొదటిరోజు 45 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతిలో 41శాతం, పదోతరగతిలో 54 మంది హాజరుకాగా... ఇంటర్‌ ఫస్టియర్‌లో 25శాతం, సెకండియర్‌లో 17శాతం విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది.

schools reopen in telangana
schools reopen in telangana
మోగిన బడి గంట... విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసేనంటా

రాష్ట్రంలో 10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బడులు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలైంది. భౌతిక దూరం, శానిటైజర్, మాస్కు లాంటి నిబంధనలు పక్కాగా అమలు చేశారు. తల్లిదండ్రుల అనుమతిస్తున్నట్లు పత్రం ఉన్నవారినే తరగతులకు అనుమతించారు. అంగీకార పత్రంపై సంతకం తీసుకుని తరగతిగదిలోకి పంపించారు. మొదటి రోజు ఒంటి పూట మాత్రమే తరగతులు నిర్వహించారు. తరగతి గదుల నిర్వాహణకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసిన విద్యాశాఖ... అందుకనుగుణంగా విద్యాసంస్థల్లో ఏర్పాట్లు చేసింది. ప్రతి గదిలోనూ భౌతికదూరం పాటిస్తూ... 20 మంది విద్యార్థులకే తరగతులు నిర్వహించారు. మాస్క్‌ ధరించడం, థర్మల్‌స్క్రీనింగ్‌ తప్పనిసరి చేశారు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువున్న విద్యార్థులను తిరిగి ఇంటికే పంపించారు. పది నెలల తర్వాత బడికి రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ, శివారాంపల్లి ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు.

విద్యాసంస్థల్లో 2 ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యాకళాశాలల్లో రోజుకు సగం మందికే ప్రత్యక్ష బోధన జరుగుతుండగా... పీజీ చివరి సంవత్సరం, బీటెక్, బీఫార్మసీలో 3, నాలుగో సంవత్సరం విద్యార్థులకే కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయితే హాజరు కచ్చితం కాదని... హాజరు లేకపోయినా పరీక్షలకు అనుమతినిస్తామని అధికారులు పేర్కొన్నారు.

పాఠశాలల్లో 9, 10, ఆపై తరగతులకు మాత్రమే ప్రత్యక్ష బోధన జరగగా... ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు... ఆన్‌లైన్ లేదా టీవీల ద్వారా బోధన కొనసాగనుంది. ఆరు నుంచి 8 తరగతులకు 15రోజుల తర్వాత బోధన ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుండగా.. ఐదో తరగతి వరకు ఈ ఏడాది ప్రత్యక్ష బోధన లేకుండానే ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత కూడా ఆన్‌లైన్ బోధన కొనసాగించనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: బడిగంట మోగింది.. సందడి మొదలైంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.