పాఠశాలల ఆన్‌లైన్ తరగతులపై మార్గదర్శకాలను విద్యా శాఖ విడుదల చేసింది. నర్సరీ నుంచి యూకేజీ వరకు వారంలో 3 రోజుల పాటు రోజుకు 45 నిమిషాలు మాత్రమే ఆన్‌లైన్ పాఠాలు బోధించాలని సూచించింది. ఒకటి నుంచి 12 తరగతుల వరకు వారానికి 5 రోజులు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోజుకు గరిష్ఠంగా గంటన్నర, ఆరు నుంచి ఎనిమిది తరగతులకు రోజుకు గరిష్ఠంగా 2 గంటలు, తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు రోజుకు గరిష్ఠంగా 3 గంటలు పాటు ఆన్‌లైన్ బోధన జరగనుంది. ఆన్‌లైన్ తరగతులకు తల్లిదండ్రులు సహకరించాలని పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన కోరారు.
ఇవీ చూడండి: సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు