ETV Bharat / city

ఆయనకు ఇద్దరు కాదు.. 3.. 4.. 5.. 6.. 7.. 8.. 9.. 10.. 11.. ??? - wedding

అతని వయసు 20 ఏళ్లు.. పెళ్లి మీదకు మనసు మళ్లింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్ల జర్నీ స్మూత్ గానే సాగింది.. పిల్లలు వచ్చారు.. కానీ, అతడిలో ఏదో తెలియని అసంతృప్తి మొదలైంది.. "నా బెటర్ హాఫ్.. ఈమె కాదేమో..?" అనుకున్నాడు. అదే ఫిక్స్ అయ్యాడు.. వెళ్లి భార్యకు చెప్పాడు.. రెండో పెళ్లి కావాలని! నెంబర్ 2 ఆగయా. ఊహూఁ.. ఇక్కడా డిఫరెంట్ ఫీల్ లేదు.. మూడోసారి కూడా పెళ్లి పీటలు ఎక్కేశాడు.. కొన్నాళ్లకే.. "రాంగ్ చెయ్యి పట్టుకున్నాను" అన్నాడు! ఆ తర్వాత.. 5.. 6.. 7.. 8.. 9.. 10.. 11.. 12.. 13.. ?????

అబూ అబ్దుల్లా
అబూ అబ్దుల్లా
author img

By

Published : Sep 16, 2022, 4:32 PM IST

సౌదీ అరేబియాకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి.. ఇటీవల ఆ దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చాడు. "అతడు ఆడవాళ్లను.. ఆట బొమ్మల్లా చూసేవాడా? లేక.. "డోంట్ కేర్" సిద్ధాంతానికి కొత్త అర్థం చెప్పిన సాహసికుడా..?" అన్నది ఆ చర్చ! ఇలా మొదలైన చర్చ.. రచ్చ రచ్చగా మారింది. సోషల్ మీడియాలో జనం రెండు గ్రూపులుగా చీలిపోయారు. కొందరు అతడు చేసిన పనికి చెడామడా తిట్టిపోస్తే.. మరికొందరు మాత్రం "మగజాతి ఆణిముత్యం" అంటూ కీర్తికిరీటం పెట్టారు! మరి.. ఇంతకీ.. అతను చేసిన ఆ "ఘన"కార్యమేంటి? అలా ఎలా మొదలైంది? ఎక్కడిదాకా చేరింది? అన్నది తెలుసుకోవాలంటే.. ఆయన పెళ్లి పుస్తకం తిరగేయాల్సిందే.. శుభలేఖలు లెక్కపెట్టాల్సిందే..!

అతని పేరు అబూ అబ్దుల్లా. 20 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా వివాహం చేసుకున్నాడు. అతని కంటే అతని భార్య ఆరేళ్లు పెద్దది. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. ఇద్దరు పిల్లలు జన్మించారు. సంసారం సాఫీగానే సాగుతోంది. కానీ.. అతనిలో ఏదో అంతర్మథనం మొదలైంది. మానసిక ప్రశాంతత కరువైంది. తీవ్రంగా మదన పడ్డాడు.. చిట్ట చివరకు కారణం ఏంటో కనుకున్నాడు! అదేమంటే.. "నాకు సరైన పార్ట్ నర్ దొరకలేదు" అనే నిర్ధారణకు వచ్చాడు. మరి, దీనికి పరిష్కారం ఏంటీ అన్నప్పుడు.. "రెండో పెళ్లి" మాత్రమే అని ఫీలయ్యాడు.. ఫిక్స్ అయ్యాడు.. వెంటనే ఈ విషయాన్ని మొదటి భార్యకు చెప్పేశాడు. సౌదీలో రెండో పెళ్లి అనేది అంత పెద్ద నేరమేమీ కాదు. ఎలాగోలా.. మొదటి భార్యను.. రెండో పెళ్లికి ఒప్పించాడు. వన్ ఫైన్ డే ముహూర్తం నిర్ణయించుకొని.. ఘనంగా రెండోస్సారి పెళ్లికొడుకయ్యాడు. కొంతకాలం గడిచిన తర్వాత.. ఆమెతోనూ ప్రయాణం చివరి వరకూ సాగదని భావించాడు. "ఇప్పుడేం చేయాలి?" అని మనసును అడిగాడు! "ఇంకేముందీ? కానీయ్ ముచ్చటగా మూడోసారి" అని ఆన్సర్ వచ్చింది. "అంతేనంటావా? ఆల్ రైట్ అన్నాడు.." మూడోసారి నిఖా పక్కా చేసుకున్నాడు.

కొన్ని రోజులకే.. చరిత్ర పునరావృతమైంది..! మూడోభార్యకూ "సారీ" చెప్పాడు. నిండా మునిగినోడికి చలి ఎక్కడిది? నాలుగో భార్యను కూడా తెచ్చుకున్నాడు. గొడవలు ఎక్కువ కావడంతో.. మొదటి, రెండు, మూడో భార్యలకు విడాకులు ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి.. ఒకరితో విడిపోయాక.. ఇంకొకరిని తెచ్చుకోవడం మొదలు పెట్టాడు. అలాగని.. ఎవరో ఒకరిని రోడ్డుమీద చూసి ఇంటికి తీసుకొస్తున్నాడనుకుంటే పొరపాటే. పెళ్లి చూపులు మొదలు.. కల్యాణంలో ఆఖరి ఘట్టం వరకూ అన్నీ సంప్రదాయ బద్ధంగా సాగినవే! ఇలా.. అబూ అబ్దుల్లా బెడ్ రూమ్.. చిన్నపాటి పుష్పక విమానంలా తయారైంది. ఎంత మంది వచ్చినా.. మరొకరికి ఎప్పుడూ చోటు ఉంటూనే ఉంది మరి! ఈ విధంగా.. భార్యల సంఖ్య పెరుగుతూ పోతోందిగానీ.. ఇతగాడు కోరుకునే భాగస్వామి మాత్రం దక్కడం లేదు.

వయసు పెరుగుతున్నా.. అబ్దుల్లా మాత్రం తగ్గేదే లే అంటూ ముందుకుసాగాడు. కోరికలు కళ్లెం వదిలిన గుర్రాలై పరుగులు తీస్తుంటే.. వాటిపై కూర్చొని తన లైఫ్ టైమ్ గోల్ కోసం.. వెతుకుతూ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. భార్యలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఏ ఒక్కరితోనూ మ్యాచ్ కావట్లేదు.. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు అతని వయసు 65 సంవత్సరాలు. ఇటీవల ఓ అరబిక్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ మధ్యనే ఒక మహిళను పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించాడు.

అబూ అబ్దుల్లా గరిష్టంగా ఒక భార్యతో కలిసున్న కాలం 4 ఏళ్లు కూడా లేదు. అతి తక్కువ కాలం లెక్క తీస్తే.. ఆశ్చర్యకరంగా ఒక్కరోజు మాత్రమే! అయితే.. తాను పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ.. ఇదేదో సరదాకోసమో, ఇంక మరిదేనికోసమో చేసింది కాదన్నాడు. ప్రతీ పెళ్లినీ సంప్రదాయబద్ధంగా చేసుకున్నానని.. తన జీవితంలో నిజమైన సంతోషాన్ని నింపే భార్యకోసం చూసిన ఎదురు చూపుల్లోభాగంగానే.. పెళ్లిళ్ల సంఖ్య పెరుగుతూ పోయిందని చెప్పాడు. ఇతను పెళ్లి చేసుకున్న వారిలో.. ఒక్కరు మినహా అందరూ సౌదీకి చెందినవారే. ఒక్కరు మాత్రమే విదేశీయురాలు. ఓసారి పనికోసం.. విదేశాలకు వెళ్లిన సమయంలో మ్యాచ్ చూసుకొని.. సెట్ చేసుకున్నాడట. కానీ.. ఆ ప్రయోగం కూడా విఫలమైంది!

అబూ అబ్దుల్లా
అబూ అబ్దుల్లా

మరి, ఇప్పటికైనా మీరు కోరుకున్న కలల రాణి మీ జీవితంలోకి వచ్చిందా? అన్న ప్రశ్నకు.. అబ్ధుల్లా సూటిగా సమాధానం ఇవ్వలేదు గానీ.. ఓ క్లారిఫికేషన్ మాత్రం ఇచ్చాడు. వయసు మీదపడిందో.. మనసు అలసిపోయిందో తెలియదుగానీ.. ఇక, మరో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం తనకు లేదని చెప్పేశాడు. "అన్నట్టూ అసలు సంగతి అడగడమే మరచిపోయాను.. ఇంతకీ మీరు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారో చెప్పనేలేదు..??" అని అడిగితే.. ముసిముసి నవ్వులతో ఆ ముసలాయన చెప్పిన నంబర్.. అక్షరాలా 53..!

ఈ నంబర్ తెలుసుకున్న నెటిజన్లు... "ముసలోడేగానీ మహానుభావుడు" అన్నట్టుగా సెటైర్లు పేల్చారు. ఆడవాళ్ల జీవితాలతో ఆటలాడుకున్న మోసగాడు అంటూ మరికొందరు తిట్టిపోస్తే.. నచ్చినట్టుగా బతికిన వీరుడు, శూరుడు అన్నారు ఇంకొందరు. మరి, మీరేమంటారు??

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.