పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను మున్సిపల్ కమిషనర్లే చేపట్టాలని పురపాలకశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సహా పబ్లిక్ ఇనిస్టిట్యూషన్స్‌లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్ కమినర్లదేనని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశించారు.
ఆయా నగర, పురపాలికల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అందులో చదువుతున్న విద్యార్థులు, టాయిలెట్ల సంఖ్యతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు కేటాయించిన సిబ్బంది సంఖ్య వివరాలను పంపాలని తెలిపారు.
ఇదీ చదవండి : అన్‌లాక్-5: సినిమా హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతి